Don't Miss!
- News ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మీరే సినిమాకు పెద్ద బలం.. విజయశాంతికి డైరెక్టర్ స్పెషల్ విషెస్
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి బర్త్ డే నేడు (జూన్ 24). ఈ సందర్భంగా ఆమె శ్రేయోభిలాషులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో సరిలేరు నీకెవ్వరు డైరెక్టర్ సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు ఆమెపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా మహేష్ బాబు సైతం విజయశాంతికి బర్త్ డే విషెస్ తెలిపాడు. సరిలేరు నీకెవ్వరు కలిపిన ఈ బంధం గట్టిగానే ఉందనిపిస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్, హీరో ఏమని ట్వీట్ చేశారో చూద్దాం.
లేడీ అమితాబ్ బర్త్ డే సందర్భంగా అనిల్ రావిపూడి ట్వీట్ చేస్తూ.. 'హ్యాపీ బర్త్ డే విజయశాంతి గారు.. మీరు నటించే సినిమాకు మీరే అతి పెద్ద ఆస్తి, బలం. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి మీరు అందించిన కృషి మాటల్లో వర్ణించలేను' అని చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు స్పందిస్తూ.. 'హ్యాపీ బర్త్ డే విజయశాంతి గారు. మీరెప్పుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాల'ని కోరుకున్నాడు. వీరి ట్వీట్లకు విజయశాంతి రిప్లై ఇస్తూ ఇరువురికి ధన్యవాదాలు తెలిపింది.
సరిలేరు సక్సెస్ తరువాత విజయశాంతికి భారీగానే ఆఫర్స్ వచ్చాయట. కానీ విజయశాంతి మాత్రం వేటిని అంగీకరించలేదని తెలుస్తోంది. విజయశాంతి డిమాండ్లు కూడా ఓ రేంజ్లో ఉండటంతో నిర్మాతలు కూడా భయపడుతున్నారని తెలుస్తోంది. అయితే విజయశాంతి వంటి స్టార్‌ను హ్యాండిల్ చేయాలంటే మామూలు విషయం కాదు. అయితే ఆ మధ్య లూసిఫర్ రీమేక్‌లో విజయశాంతి నటించబోతోందనే వార్తలు వచ్చాయి కానీ అవి వట్టి రూమర్స్‌గానే మిగిలిపోయాయి.