ఆయన దెబ్బకు బాక్సాఫీసు అబ్బా.. నిద్ర పట్టడం లేదు, మహేష్ బాబు కూడా: అనిల్ రావిపూడి
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్స్‌గా దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన చిత్రం 'ఎఫ్ 2- ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్'. ఈ చిత్రం సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ... వరుణ్ తేజ్ తోడల్లుడు 2, కోబ్రా 2గా నటించారు. స్క్రీన్ మీద వెంకటేష్ గారితో వరుణ్ తేజ్ చేసిన కెమిస్ట్రీ, టైమింగ్ ఎంత బాగా వర్కౌట్ అయిందో అందరూ చూశారు. ఎలాంటి ఈగో లేకుండా ఎంతో జెన్యూన్‌గా కష్టపడి పని చేశాడు. నాకు ఎంతో సపోర్ట్ చేశాడు. ఆయనతో మళ్లీ మళ్లీ చేయాలనుకుంటున్నాను అని తెలిపారు.

వెంకటేష్ దెబ్బ.. బాక్సాఫీసు అబ్బా
వెంకటేష్ గారి గురించి ఒకటి చెప్పాలనుకుంది. ‘వెంకటేష్ గారి దెబ్బ.. బాక్సాఫీసు అబ్బా'.. చాలా రోజుల నుంచి ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. థియేటర్లో ఎంతలా ఎంజాయ్ చేశారో చూశాను. నేను యాక్టింగ్ చేసి చూపిస్తాను అని కొందరు అంటున్నారు. కానీ వెంకటేష్ గారు ఒక లైబ్రరీ.. ఆయనకు మనం చెప్పేది ఏమీ ఉండదు.. ఏరు కోవడమే. ఎన్నో రియాక్షన్స్ ఇచ్చి ఎంతో ఎనర్జిటిక్ గా పని చేశారు. ఆయన ఎంత కష్టపడ్డారో సినిమాకు పని చేసిన అందరికీ తెలుసని అనిల్ రావిపూడి తెలిపారు.

నవ్వు విలువ ఏమిటో తెలిసింది
ప్రతి ఒక్కరి జీవితంలో నవ్వు ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు. బాధను దూరం చేసేది నవ్వు. మనిషిని దగ్గర చేసేది నవ్వు. గొడవను తగ్గించేది నవ్వు. గౌరవాన్ని పెంచేది నవ్వు. మనిషి ఆయుష్షు పెంచేది నవ్వు.. ఈ నవ్వులు ఇచ్చినందుకు మీరు నవ్వుతూ మాకు కలెక్షన్ల వర్షం కురిపించారు. నేను ప్రతి సినిమాలో 30, 40 శాతం మాత్రమే నవ్వించాను. ఈ సినిమాలో 100శాతం నవ్వించే ప్రయత్నం చేశాం. ఆ నవ్వు విలువ ఏమిటో ఈ సంక్రాంతికి తెలిసింది. నా లైఫ్‌లో ఇది నవ్వుల సంక్రాంతి. లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే సంక్రాంతి. అంత పెద్ద హిట్టు ఇచ్చారని అనిల్ చెప్పుకొచ్చారు.

కలెక్షన్లు చూస్తుంటే నిద్రపట్టడం లేదు
కలెక్షన్లు, ఆదరణ చూస్తుంటే నిద్ర పట్టడం లేదు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ థాంక్స్. ఓవర్సీస్‌లో కూడా 1 మిలియన్ దాటేసింది. నా డ్రీమ నెరవేర్చిన అక్కడి ప్రేక్షకులకు కూడా థాంక్స్.

మహేష్ బాబు భుజం తట్టారు
ఈ సందర్భంగా ఒకరి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒక మనిషి ఎదుగుతున్నపుడు వాడి భుజం తట్టడం ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందం సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇచ్చారు. ఈ సినిమా టీజర్ రిలీజైన దగ్గర నుంచి ఆయన చేసే ట్వీట్స్ మంచి కిక్ ఇచ్చాయి. అలాగే రిలీజైన తర్వాత చూసి ఎంతో ఎంకరేజ్ చేశారు. మా సినిమా టీం తరుపున ఆయనకు స్పెషల్ థాంక్స్ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











