వెంకీకి 34 ఏళ్లు.. అనిల్ రావిపూడి ఎమోషనల్ ట్వీట్
దగ్గుబాటి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్.. అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన వెంకటేష్.. మొదటి చిత్రం కలియుగ పాండవులతో భారీ సక్సెస్‌నే కొట్టాడు. సినిమా హీరోగా మొదటి అడుగే భారీ విజయాన్ని నమోదు చేయగా.. నేటికి నటుడిగా 34 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వెంకీకి పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు వెంకటేష్ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.
కలియుగ పాండవులు 1986 ఆగస్ట్ 14న విడుదలైంది. రామానాయుడు నిర్మాణంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు తెరకెక్కించిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంతోనే కుష్బూ కూడా తెరకు పరిచయమైంది. తన నటనా ప్రస్థానానికి 34 ఏళ్లు పూర్తి కావడంతో వెంకటేష్ స్పందిస్తూ.. 'కలియుగ పాండువులు రిలీజై నేటికి 34 ఏళ్లు అవుతోంది. రాఘవేంద్రరావు గారికి, మా తండ్రికి, కుష్బూకి, సురేష్ ప్రొడక్షన్ యూనిట్‌కి థ్యాంక్స్.. ఇదో అందమైన మెమోరీ' అంటూ నాటి విశేషాలను తెలిపాడు.

వెంకటేష్ ట్వీట్‌కు అనిల్ రావిపూడి స్పందిస్తూ.. 'ఎంత అద్భుతమైన ప్రయాణం సర్.. మీ జర్నీలో నేను చిన్న పార్ట్‌ను పోషించినందుకు చాలా ఆనందంగా ఉంది.. భవిష్యత్తులోని ఇంకా పనిచేసేందుకు ఎదురుచూస్తునా' అంటూ ఎఫ్3 ప్రాజెక్ట్‌పై చిన్న హింట్ ఇచ్చాడు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ఎఫ్2 దుమ్ములేపిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదుచేయడంతో ఎఫ్2కి సీక్వెల్ కూడా రెడీ చేయబోతోన్నాడు. ఇప్పటికే దాదాపు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఇందులో మరో హీరోకు కూడా చోటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











