twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు పేరు చెప్పకుండా.. ఉత్కంఠకు గురిచేస్తున్న దర్శకుడు!

    |

    Recommended Video

    Interesting News About Superstar Mahesh Babu | Maharshi | Vamshi Paidipally | Filmibeat Telugu

    మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించేశారు. దీనితో మహేష్ తదుపరి చిత్రాలపై కసరత్తులు మొదలైపోయాయి. ఎఫ్2 చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి మహేష్ బాబుతో ఓ చిత్రం చేయబోతున్నాడు. అనిల్ వినిపించిన కథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి కథకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది.

    వరుస విజయాలు

    వరుస విజయాలు

    అనిల్ రావిపూడి పటాస్ చిత్రంతో దర్శకుడిగా మారాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్ చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. ఇటీవల విడుదలైన ఎఫ్2 చిత్రం 80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఘనవిజయం సాధించింది. ఎఫ్2 విజయంతో అనిల్ రావిపూడి టాలీవుడ్ లో స్టార్ దర్శకుల సరసన చేరిపోయాడు.

    మహర్షి తర్వాత

    మహర్షి తర్వాత

    అనిల్ రావిపూడి తన కెరీర్ లో తొలిసారి ఓ బడా హీరోతో చిత్రాన్ని తెరక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు. అనిల్ రావిపూడి త్వరలో మహేష్ బాబుతో సినిమాకి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. మహర్షి చిత్రం పూర్తి కాగానే అనిల్, మహేష్ చిత్రం ప్రారంభం అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి అనిల్ తాజాగా ట్విట్టర్ లో హింట్ ఇచ్చాడు.

    నెం 5 లోడింగ్

    అనిల్ రావిపూడి ట్వీట్ చేస్తూ.. మహేష్ బాబు పేరు ప్రస్తావించకుండా ఈ ప్రాజెక్ట్ గురించి తెలిపాడు. తాను దర్శత్వం వహించే 5వ చిత్ర కథకు తుదిమెరుగులు దిద్దుతున్నాను. త్వరలోనే ప్రారంభం కాబోతోంది అని అనిల్ రావిపూడి ప్రకటించాడు. అది మహేష్ బాబు సినిమానే అంటూ అభిమానులంతా అనిల్ రావిపూడి ట్వీట్ కు కామెంట్స్ పెడుతున్నారు.

    దిల్ రాజు నిర్మాణంలో

    దిల్ రాజు నిర్మాణంలో

    అనిల్ రావిపూడి వరుసగా దిల్ రాజు నిర్మాణంలో సినిమాలు చేస్తున్నారు. మహేష్ తో తెరకెక్కించబోయే చిత్రానికి కూడా దిల్ రాజే నిర్మాత అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఓ హీరోయిన్ గా నటించబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

    English summary
    Anil Ravipudi tweets about Mahesh babu movie. After Maharshi Anil Ravipudi will going to direct mahesh
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X