twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మ్యూజిక్ డైరెక్టర్ మరణంపై వీడని మిస్టరీ

    By Bojja Kumar
    |

    గమ్యం సినిమా సంగీత దర్శకుడు అనిల్ రెడ్డి మృతిపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన మరణించి దాదాపు నాలుగు నెలలు గడిచి పోయింది. అయితే ఇప్పటి వరకు అనిల్ మరణం వెనక గల అసలు కారణాలను మాత్రం చేధించడంలో పోలీసులు విఫలం అయ్యారనే చెప్పాలి. ఇప్పటికే అనిల్ రెడ్డి బాడీకి రెండు సార్లు పోస్టుమార్టం నిర్వహించారు. తొలుత రిపోర్టు ఇచ్చిన అపోలో ఆసుప్రతి వైద్యలు అనిల్ గుండె సంబంధమైన వ్యాధితో మరణించారని వెల్లడించారు. అనంతరం గాంధీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టులో అతని తలకు గాయం కావడం వల్ల మరణించాడని వెల్లడైంది.

    ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రెండింటిలో ఎవరి రిపోర్టు నిజం అనే విషయం తేల్చేందుకు, మరణం వెనక ఉన్న అసలు రహస్యం కనుగొనేందుకు కాకతీయ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ రమేష్, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు మరో బృందాన్ని నియమించారు. ఇటీవల ఈ బృందం తని బాడీకి పోస్టు మార్టం నిర్వహించి రిపోస్టును కోర్టుకు సమర్పించినట్లు సమాచారం. అప్పటికే అనిల్ బాడీ చాలా వరకు కుళ్లి పోవడం, అవయవాలు పోస్టు మార్టానికి అనుకూలంగా లేక పోవడం వల్ల ఇందులో సరైన ఫలితాలు రాలేదనే వాదన వినిపిస్తోంది. మరి రిపోర్టులో ఏముంది. మూడు భిన్నమైన రిపోర్టుల నేపథ్యంలో...అతని మరణ వెనక రహస్యం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఏప్రిల్ 21న రాత్రి అనిల్ రెడ్డి తన కాబోయే భార్య శాలినితో పాటు కలిసి బయటకు వెళ్లి అనుమానస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఎక్కువ మంది శాలిని తీరుపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Budding music director Anil Reddy's death continues to be shrouded in mystery as the investigation is back to square one. The third postmortem report submitted by forensic experts a couple of days ago said they have no opinion to give.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X