twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి2 కలెక్షన్లు తూచ్..ఏ రికార్డును బ్రేక్ చేయలేదు.. అలా పోల్చితే నా సినిమా రూ.5000 కోట్లు..

    బాహుబలి2 సినిమా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేయలేదని బాలీవుడ్ దర్శకుడు అనిల్ శర్మ తాజాగా వ్యాఖ్యానించాడు.

    By Rajababu
    |

    బాహుబలి2 సినిమా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేయలేదని బాలీవుడ్ దర్శకుడు అనిల్ శర్మ తాజాగా వ్యాఖ్యానించాడు. బాహుబలి2 చిత్రం రూ.1500 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించిందనే అంశపై మాట్లాడుతూ.. బాహుబలి సాధించిన కలెక్షన్ల గురించి పెద్దగా మాట్లాడుకోవద్దనే విధంగా మాట్లాడారు. గతంలో తాను రూపొందించిన గదర్ చిత్రం 2001లోనే రూ.265 కోట్లు వసూలు చేసిందనే విషయాన్ని గుర్తు చేశారు.

    బాహుబలి రికార్డు సృష్టించలేదు..

    బాహుబలి రికార్డు సృష్టించలేదు..

    బాహుబలి2 సినిమా రూ.2000 కోట్లు వసూలు చేసినా పెద్దగా పట్టించుకోవద్దు. 2001లో నేను తీసిన గదర్: ఏక్ ప్రేమ్ కత చిత్రం రూ.265 కోట్లు వసూలు చేసింది. ఆ కలెక్షన్లను ప్రస్తుత పరిస్థితులతో పోల్చుకొంటే రూ.5000 కోట్లకు సమానం అని అనిల్ శర్మ అన్నారు. బాహుబలి కలెక్షన్లు రికార్డు కాదా అని అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ మళ్లీ మళ్లీ అదే ప్రశ్నను అడిగి వివాదంలోకి లాగకండి అని అన్నారు.

    నా సినిమా 5000 కోట్లు..

    నా సినిమా 5000 కోట్లు..

    2001లో సినిమా టికెట్ ఖరీదు రూ.25 మాత్రమే. ఆ సమయంలో గదర్ చిత్రం రూ.265 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుత రేట్లలో పోల్చుకుంటే ఆ సినిమా రూ.5000 కోట్లు సంపాదించినట్టు అవుతుంది. కానీ బాహుబలి2 వసూలు చేసింది కేవలం రూ.1500 కోట్లు మాత్రమే. అలాంటప్పుడు రికార్డు ఎలా అవుతుందో చెప్పాలి అని అనిల్ శర్మ ఎదురు ప్రశ్న వేశారు. కొన్నిసార్లు మంచి సినిమాలు వస్తాయి. కొన్ని రికార్డులను బ్రేక్ చేస్తాయి. కాని బాహుబలి విషయానికి వస్తే అది ఎలాంటి రికార్డును నెలకొల్పలేదు అని ఆయన అన్నారు.

    గదర్ సంచలన విజయం..

    గదర్ సంచలన విజయం..

    సన్నిడియోల్ హీరోగా, అమీషా పటేల్ హీరోయిన్‌గా నటించిన గదర్ చిత్రం దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధించింది. అప్పట్లో సంచలన విజయం నమోదు చేసిన చిత్రంగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. పాక్, భారత సైనికుల మధ్య జరిగిన పోరాటాలను దర్శకుడు అనిల్ శర్మ అద్భుతంగా తెరకెక్కించాడు.

    కుమారుడు హీరోగా జీనియస్..

    కుమారుడు హీరోగా జీనియస్..

    దర్శకుడిగా అనిల్ శర్మ గదర్, ఆషిక్, మదోషి, అప్నే, వీర్, సింగ్ సాహెబ్ ది గ్రేట్ తదితర చిత్రాలను రూపొందించారు. ప్రస్తుతం తన కుమారుడు ఉత్కర్ష్ హీరోగా జీనియస్ అనే సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాహుబలి కలెక్షన్లపై స్పందించారు. జీనియస్ సినిమా స్క్రిప్ట్‌ను రెండేళ్లు కష్టపడి రూపొందించాను. కథ అద్భుతంగా ఉంటుంది అని ఆయన వెల్లడించారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీనియర్ నటులు ధర్మేంద్ర, హేమామాలిని దంపతులు హాజరయ్యారు.

    English summary
    Director Anil Sharma said, "'Gadar' had done a business of Rs 265 crore in 2001 when the ticket rates were Rs 25 only. As per valuation, it is Rs 5,000 crore today". He says Baahubali 2: The Conclusion has not set any record yet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X