బడ్జెట్ లిమిట్ దాటింది:‘ దూకుడు’ నిర్మాత
మొదట మేము అనుకున్నదానికంటే 'దూకుడు"సినిమాకి బడ్జెట్ ఎక్కువే అయ్యిందీ. అయితే దానికి కారణం ఇటీవల జరిగిన సినీపరిశ్రమ సమ్మె అంటున్నారు 'దూకుడు" నిర్మాత అనీల్ సుంకర. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటతో కలిసి ఆయన నిర్మించిన 'దూకుడు" చిత్రం పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ పాటలు శ్రోతల్ని విశేషంగా అలరిస్తున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ సుంకర పై విధంగా స్పందించారు.
అలాగే శ్రీను వైట్ల టైమింగ్, మహేష్ టైమింగ్ కలిస్తే 'దూకుడు". టైటిల్‌కి తగ్గట్టుగా సినిమా ఉంటుంది. ఇందులో మహేష్ నట విశ్వరూపాన్ని చూస్తారు. ఏదిఏమైనా అద్భుతం అనిపించేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు శ్రీనువైట్ల. రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అని చెప్పారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోను సూద్, సాయాజీ షిండే, నాజర్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, మాస్టర్ భరత్, సురేఖావాణి, సుధ, వినయప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: కె.వి.గుహన్, రచన: గోపి మోహన్, కోన వెంకట్, సమర్పణ: జి.రమేష్‌బాబు.


Click it and Unblock the Notifications











