అల్లరి నరేష్ 'యాక్షన్‌' 3D లో కథంటూ ఏమీ లేదు

By Srikanya

హైదరాబాద్ : నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అనిల్‌ దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంలోనే 'యాక్షన్‌' పేరుతో త్రీడీ చిత్రాన్ని తెరకెక్కించారు. నరేష్‌, వైభవ్‌, కిక్‌శ్యామ్‌, రాజుసుందరం హీరోలుగా నటించారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా అనిల్‌ సుంకర హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు.

'యాక్షన్‌' 3డి గురించి చెప్తూ... ''నలుగురు స్నేహితుల మధ్య సంఘటనల సమాహారమే 'యాక్షన్‌'. నిజానికి ఇందులో ప్రత్యేకంగా కథంటూ ఏమీ వూండదు. వ్యాపారానికైతే ఓ అగ్రిమెంట్‌ వూంటుంది. స్నేహానికి అలాంటిదేమీ వూండదు, వూండకూడదు అనే అంశం చుట్టూ చిత్రాన్ని తీర్చిదిద్దాం. హాస్య సన్నివేశాల్ని త్రీడీలో తెరకెక్కించడం ఓ చక్కటి అనుభవం. ఇతర యాక్షన్‌, హర్రర్‌ త్రీడీ సినిమాల తరహాలో ఇందులో ఎఫెక్టులు ప్రేక్షకుడి మీదకు వచ్చి పడటంలాంటివేవీ వూండవు. తెరపై కనిపించే దృశ్యంలో వెనకా ముందూ అంతరాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా త్రీడీలో పాటలు ప్రేక్షకుడికి కొత్త తరహా వినోదాన్ని పంచుతాయి'' అన్నారు.

అలాగే తనపై శ్రీను వైట్ల ప్రభావం ఉందని చెప్తూ... ''నిర్మాణం, దర్శకత్వం రెండూ ఒకేసారి చేయడం కష్టంతో కూడుకొన్న వ్యవహారం. పగటిపూట దర్శకుడిగా సృజనాత్మకతతో ఆలోచిస్తూ ఎందులోనూ రాజీపడకుండా చేస్తాం. సాయంత్రమయ్యేసరికి దాని తాలూకు ఖర్చుల చిట్టాలు చేతికందుతాయి. అమెరికాకి చెందిన స్టీరియోగ్రాఫర్‌ కీత్‌తోపాటు, చిత్ర కథానాయకులు ఎంతగానో సహకరించారు. దర్శకుడు శ్రీను వైట్ల కూడా సలహాలు ఇచ్చారు. మొదట్నుంచి ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నా కాబట్టి ఈ సినిమాలో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది'' అన్నారు.

సినిమా ప్రమోషన్ సరికొత్తగా నిర్వహిస్తున్న నిర్మాతలు.....మా సినిమా చూడండి, డిస్నీలాండ్ వెళ్లే లక్కీఛాన్స్ పొందండి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా 'సినిమా చూసిన తర్వాత మీ టికెట్ నెంబర్, పర్సనల్ డీటేల్స్ '56263' అనే నెంబర్‌కి ఎస్ఎంఎస్ చేయండి. లేదా [email protected] కి ఈ-మెయిల్ చేయడం. అన్ని ఖర్చులు వారే భరిస్తారు. ఇంకేం...ఈ నెల 21న విడుదలవుతున్న సినిమా చూసి మీ అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X