3D లో పెళ్ళిపాట తెరకెక్కిస్తున్న ‘దూకుడు'నిర్మాత
హైదరాబాద్: 'దూకుడు'నిర్మాత అనీల్ సుంకర ప్రతీ పని డిఫెరెంట్ గా ఉండాలనుకుంటారు. తాజాగా ఆయన ఓ పెళ్లిపాటను 3D లో తెరకెక్కిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న 'యాక్షన్' 3డి కోసం ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని అనీల్ సుంకర స్వయంగా ట్విట్టర్ తో తెలియచేసారు. ఆయన ట్వీట్ లో..." ఓ కలర్ ఫుల్ వెడ్డింగ్ సాంగ్ ని యాక్షన్ చిత్రం కోసం ఈ రోజు షూట్ చేసాం. ఈ పాట ఓ విజువల్ ట్రీట్ లా ఉంటుంది. ఈ పాటను రామ జోగయ్య శాస్త్రిగారు రాయగా సాయి కార్తీక్ స్పెషల్ గా ట్యూన్ చేసారు. పాట చాలా బాగా వచ్చింది. తప్పనిసరిగా రాబోయే పెళ్లిళ్లలో ఈ పాట మారు మ్రోగుతుంది " అని పోస్ట్ చేసారు.
అల్లరి నరేష్, వైభవ్, రాజసుందరం, కిక్‌శ్యామ్ ప్రధాన పాత్రదారులుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు అనిల్ సుంకర మాట్లాడుతూ, 'ఓ చక్కటి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. చిత్రం బాగా వస్తున్నదంటే అందుకు నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల సహకారం ఎంతగానో ఉంది. సర్వేష్ మురారి ఛాయాగ్రహణం కనువిందు చేస్తుంది. త్వరలో బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్, గోవాలో ఓ షెడ్యూల్ చేస్తాం' అని చెప్పారు.
ఈ చిత్రం గురించి 'అల్లరి'నరేష్ మాట్లాడుతూ, 'సినిమా రంగం పట్ల అభిరుచి మాత్రమే కాదు పక్కా ప్లానింగ్ ఉన్న నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రంతో దర్శకుడు కావడం అభినందనీయం. లోగడ నిర్మాతగా అనిల్ తీసిన చిత్రాలు ఎంతోబాగా వచ్చాయంటే, వాటిలో ఆయన కృషి కూడా ఎంతో ఉంది. ఇక ఈ చిత్రకథ కోసం ఆయన ఒకటిన్నర సంవత్సర సమయాన్ని వెచ్చించారు. బైలింగ్వల్ చిత్రమిది. ఏకకాలంలో తెలుగుతో పాటు తమిళ వెర్షన్ షూటింగ్ కూడా చేస్తున్నారు. తండ్రీతనయులు బప్పా, బప్పీలహరి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం ఓ విశేషం. రీరికార్డింగ్‌తో పాటు తమన్ ఓ పాటకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మొత్తంమీద ఓ మంచి టీమ్‌తో కలసి 3డి సినిమా చెయ్యటం ఓ కొత్త అనుభవం' అని అన్నారు.


Click it and Unblock the Notifications











