'శ్రీరామ రాజ్యం' పై దూకుడు నిర్మాత
బాపు, బాలకృష్ణల కాంబినేషన్ లో రూపొందిన శ్రీరామ రాజ్యం గురించి దూకుడు నిర్మాత అనీల్ సుంకర ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. ఆయన ఈ సినిమా గురించి చెపుతూ.. శ్రీరామ రాజ్యం ఓ విజువల్ ఫీస్ట్. ఈ చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్ లోనూ నిర్మాతల ఫ్యాశన్ కనపిస్తుంది. ఇలాంటి సినిమా నిర్మించాలంటే చాలా ధైర్యం, కమిట్ మెంట్ కావాలి. మీరు మాత్రమే న్యాయం చేయగల పాత్ర చేసినందుకు కంగ్రాట్స్ బాలకృష్ణ గారూ. ఇక అక్కినేని గారిని మళ్లీ స్క్రీన్ పై చూడటం చాలా మందిని ఆనందపరిచే అంశం. నయనతార మొత్తం షోని కొల్లగొట్టింది. ఓవర్ ఆల్ గా ఈ రోజుల్లో బెస్ట్ నాన్ కమర్షియల్ ఎటమ్ట్ చేసిన యూనిట్ వారందరికీ ఈ చిత్రం విజయంలో భాగముంది అన్నారు.
ఇక శ్రీరామ రాజ్యం చిత్రం మొన్న గురువారం విడుదలై అంతటా మంచి ప్రశంసలు పొందుతోంది. బాలకృష్ణ నటనకు అందరూ నీరాజనాలు పడుతున్నారు. అలాగే బాపు ప్రేమింగ్, ముళ్లపూడి వారి రచనా శైలి అంతటా మరో మారు ప్రశంసలు పొందుతోంది. ఇతర దేశాల్లో సైతం ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టుతోంది. ప్రవాసాంద్రులు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించి భక్తి పారవశ్యం పొందుతున్నారు.


Click it and Unblock the Notifications











