twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెకెండాఫ్ వీక్ అంటారా? దూకుడు నిర్మాత ఫైర్

    By Srikanya
    |

    దూకుడు చిత్రం ఫస్టార్ చాలా బాగుంది..సెకెండాఫ్ వీక్ గా ఉంది అంటూ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై దూకుడు నిర్మాత అనీల్ సుంకర మండి పడ్డారు. అస్సలు మేమే సెకెండాఫ్ చూడలేదు..మీరు ఎలా చెప్పగలుగుతారు అన్నారు. ఇక మరో విషయం నిన్ననే క్లైమాక్స్ లో వచ్చే పాటను ఎడిట్ చేసాం. పూవై పాట షూటింగ్ జరుగుతోంది. కాబట్టి మహేష్ అభిమానులు ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు అని కొట్టి పారేసారు. అలాగే నీ దూకుడు...సాటెవ్వడు అంటూ అదిరిపోయే లెవెల్లో ఆడియో ఫంక్షన్‌ చేసిన నిర్మాతలు అంతకన్నా ఘనంగా 23న భారీ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమైపోతున్నారు.

    తన తాజా చిత్రం దూకుడు గురించి మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత ట్వీట్ చేసారు. ఆయన మాటల్లోనే.. మా డైరక్టర్ మాటల ప్రకారం దూకుడు ఫస్టాఫ్ ఆర్.ఆర్ అవుట్ స్టాండింగ్. తమన్ కే ఈ ప్రశంసలు అన్నీ దక్కుతాయి. ధాంక్యూ తమన్.సెకెండాఫ్ కూడా ఇంతకన్నా బాగా చేస్తాడని ఆసిస్తున్నాను.నా వరకూ చెప్పాలంటే నేను గ్రేట్ వర్క్ చేస్తున్న ఫీలింగ్ లో ఉన్నాను. పని..పని..పని అన్నట్లుంది అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.

    English summary
    Anil Sunkara said, “No one saw second half till now. So forget all the postings. How can any one see and comment. So nothing to worry.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X