ఈ సమయంలోనే మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుస్తుంది: ఉపాసన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తాజా విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించడమే గాక, రామ్ చరణ్ సినిమా విశేషాలను, మెగా కుటుంబ సంగతులను కూడా పంచుకుంటూ ఉంటుంది ఈ మెగా కోడలు.
ఇకపోతే ఆమెకు ఈ లోకంలోని జంతువులంటే మహా ప్రేమ. అయితే దేశంలో కరోనా లాక్‌డౌన్ నడుస్తున్న నేపథ్యంలో చాలా మంది జంతువులను నిర్లక్ష్యం చేస్తున్నారని, కొంత మంది వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది ఉపాసన. ఈ టైమ్‌లో జంతువులతో ఉండడం అంత ప్రమాదమేమీ కాదని, జంతువులతో కరోనా సోకదని ఆమె తెలిపింది.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో తన గుర్రానితో కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేసిన ఉపాసన.. ''స్వీయ నిర్బంధమే కానీ, నా డార్లింగ్ డేయిసీకి (ఆమె గుర్రం) దూరంగా కాదు. జంతువుల పట్ల ప్రేమ, సంరక్షణను చూపించాల్సిన అసలైన సమయం ఇదే. కొంత మంది ఈ పరిస్థితుల్లో జంతువులను వేదిలేస్తున్నారు. మీ జంతువుల పట్ల మీరు చూపించే ప్రేమ, సంరక్షణ మీలోని వ్యక్తిత్వాన్ని బయటపెడుతోంది'' అని పేర్కొంది. ఆమె చేసిన ఈ ట్వీట్ చూసి జంతు ప్రేమికులు హ్యాట్సాఫ్ ఉపాసన అంటున్నారు.


Click it and Unblock the Notifications











