బెస్ట్ ధాట్:యానిమేషన్ 'చందమామ'

By Staff

Chandamama-Logo
చిన్నప్పుడు మనమంతా చదువుకుని ఎంజాయి చేసిన చందమామ కథలు ఇప్పుడు సినిమా రూపంలో తెరకెక్కనున్నాయి. చందమామ యాజమాన్యం వారు తిరువనంతపురంకి చెందిన టెక్నో పార్క్ కి చెందిన టూన్ ఏనిమేషన్ సహకారంతో ప్రయత్నానికి శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు ఇరవై కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం ఓ ఛక్కని ఊహా ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుందని టూన్ ఏనిమేషన్ సంస్ధ సీఈవో పి.జయకుమార్ చెప్తున్నారు.

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ చందమామ కథలు తరతరాలుగా మన మనస్సులను ఆక్రమించి ఆనందన్ని పంచుతూనే ఉన్నాయి. ఈ కథల గొప్పతనం వాటి సింపుల్ సిటీ,సామాజిక...సాంస్కృతిక విలువలను బోధించటంలోనే ఉంది. వీటిని ఈ తరం వారికి పరిచయం చేయటానికి యానిమేషన్ విధానమే ఉత్తమమైనదని భావిస్తున్నానని అంటున్నారు.

ఇక లెజండరీ ఫిల్మ్ మేకర్ బి.నాగిరెడ్డి తన స్నేహితుడు చక్రపాణి సారధ్యంలో నడిపిన చందమామ 1947 నుంచి పిల్లలను అలరిస్తూనే ఉంది.పధ్నాలుగు భాషల్లో వెలవడుతున్న ఈ పత్రికకు ఎక్సక్లూజివ్ గా పదిహేనువేల కథలు దాకా ఉన్నాయి.వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి తెరకెక్కిస్తున్నాము. ఇది మంచి ప్రయత్నంగా మేము భావిస్తున్నాం అంటున్నారు చందమామ సి.ఈ.ఓ ఎల్.సుబ్రమణ్యం.బెస్ట్ ఆఫ్ లక్ చెపుదామా...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X