ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ: మరింత క్లారిటీ ఇచ్చిన అనిరుధ్
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మరో ఛాన్స్ కొట్టేశాడు.
Recommended Video

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖకారు కాలేదు. హారిక అండ్ హాసిని క్రిషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈచిత్రానికి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా మొదలు కాబోతోంది. హారిక అండ్ హాసిని క్రిషన్స్ వారే నిర్మించనున్న ఈ చిత్రానికి కూడా సంగీతం అందించే అవకాశం అనిరుధ్ దక్కించుకోవడం విశేషం.

ఎన్టీఆర్-త్రివిక్ర్ మూవీ గురించి అనిరుధ్
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీకి సంబంధించి సంగీత దర్శకుడు అనిరుధ్ మరింత క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 16న అనిరుధ్ పుట్టినరోజు సందర్భంగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఓ వీడియో విడుదల చేశారు.

పవన్, త్రివిక్రమ్ గురించి అనిరుధ్
పవన్-త్రివిక్రమ్ సినిమా ద్వారా తెలుగులో ఎంటరవ్వడం ఆనందంగా ఉందని, త్రివిక్రమ్ సార్ తనకు ఎంతో సపోర్టుగా ఉన్నారని, పవన్ కళ్యాణ్ సార్ తనను ఎంతగానో ఎంకరేజ్ చేశారని అనిరుధ్ తెలిపారు.

నెక్ట్స్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ
త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు దీని తర్వాత ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు కూడా తాను సంగీతం అందించనున్నట్లు, ఇందుకోసం ట్యూన్లు సిద్ధం చేస్తున్నట్లు అనిరుధ్ తెలిపారు.
తన కెరీర్ గురించి..
తన కెరీర్ గురించి అనిరుధ్ మాట్లాడుతూ... ‘3' సినిమా ద్వారా కెరీర్ ప్రారంభించానని, అంతకు ముందు తనకు సినిమా మ్యూజిక్ డైరెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియదని, ఆ సినిమాకు పని చేస్తూనే చాలా విషయాలు నేర్చుకున్నానని, ఈ ఐదారేళ్ల కాలంలో దాదాపు 14 సినిమాలకు పని చేశానని తెలిపారు. తెలుగు ప్రేక్షకులు తనను ఆధరిస్తారనే నమ్మకంతో ఉన్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











