twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నా పనైపోయిందనుకున్నార్రా'.. జెర్సీ చిత్రంపై అనిరుధ్.. సెలెబ్రిటీలు ఫిదా!

    |

    నేచురల్ స్టార్ నాని మరోమారు జూలు విదిల్చాడు. గత ఏడాది పరాజయాల నుంచి తిరిగి పుంజుకుని అద్భుత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాని క్రికెటర్ పాత్రలో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే జెర్సీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ కూడా ఈ చిత్రాన్ని మంచి రివ్యూలు ఇస్తున్నారు. జెర్సీ చిత్రంలో నాని నటన, ఎమోషన్స్ ప్రేక్షకులని కట్టిపడేసే విధంగా ఉన్నాయి. నాని కెరీర్ లో జెర్సీ చిత్రం మరో బ్లాక్ బస్టర్ కావడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా జెర్సీ చిత్రపై సెలెబ్రిటీలు తమ స్పందనని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

    క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్

    క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్

    తమిళంలో అనిరుధ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద దర్శకులు, స్టార్ హీరోలు అనిరుధ్ సంగీత దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తుంటారు. అనిరుధ్ గత ఏడాది అజ్ఞాతవాసి చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. కానీ ఆ చిత్రం నిరాశపరిచింది. అయినా కూడా అనిరుధ్ కు తెలుగులో మరో అవకాశం వచ్చింది. జెర్సీ చిత్రానికి ఇతడే సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన, రివ్యూలు చూసిన తర్వాత అనిరుధ్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.

    నా పనైపోయిందనుకున్నార్రా

    అనిరుద్ ట్విట్టర్ లో స్పందిస్తూ పేట చిత్రంలోని రజనీకాంత్ డైలాగ్ చెబుతున్న వీడియో పోస్ట్ చేశాడు. 'నా పనైపోయిందనుకున్నార్రా' అంటూ రజనీకాంత్ చెప్పే డైలాగ్ ఈ వీడియోలో ఉంది. జెర్సీ చిత్రానికి వస్తున్న స్పందన, రివ్యూలు చూసిన తర్వాత స్టూడియోలో మా స్పందన ఇదే అని అనిరుధ్ కామెంట్ పెట్టాడు. ఇది తెలుగులో నా తొలి బ్లాక్ బస్టర్ విజయం. నాని, గౌతమ్ తిన్ననూరి, నిర్మాత నాగవంశీకి కృతజ్ఞతలు అని అనిరుధ్ ట్వీట్ చేశాడు.

    అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామా

    నానికి భలే భలే మగాడివోయ్ లాంటి ఘనవిజయాన్ని అందించిన దర్శకుడు మారుతి జెర్సీ చిత్రం గురించి స్పందించాడు. జెర్సీ అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామా. నాని హానెస్ట్ పెర్ఫామెన్స్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. అతడి నటన సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, అనిరుధ్ నేపథ్య సంగీతం చాలా బావున్నాయి. జెర్సీ చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అని మారుతి ట్వీట్ చేశారు.

    గొప్పగా వింటున్నా

    నాని జెర్సీ చిత్రం గురించి చాలా గొప్పగా వింటున్నా. ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. నాని నటనని ప్రశంసిస్తున్నారు. ఆ ప్రశంసలకు నాని అన్నివిధాలా అర్హుడు. దర్శకుడు గౌతమ్ తిన్నారి సహా చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ అని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు.

    English summary
    Anirudh Ravichander interesting comments on Jersey movie. Director Maruthi and Harish Shankar also responds on Jersey movie success.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X