»   » మరి త్రివిక్రమ్‌ ఎవరిని తీసుకుంటాడు?

మరి త్రివిక్రమ్‌ ఎవరిని తీసుకుంటాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ హీరోగా సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ‘అ...ఆ' (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శర వేగం గాజరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ చేస్తున్న తొలి సినిమా ఇది.

తొలిసారి పొలిమేర దాటుతున్న త్రివిక్రమ్: ఆ స్టార్ హీరోతో నెక్ట్స్!

ఈ సినిమా అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుండి అతను తప్పుకున్నాడు. బీప్ సాంగ్ వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో మళ్లీ దేవిశ్రీ ప్రసాద్ తో సంప్రదింపులు జరుపుతున్నాడట త్రివిక్రమ్. అయితే దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతుండటంతో....చేయడానికి దేవిశ్రీ ఓకే చెబుతాడా? లేదా? అనేది హాట్ టాపిక్ అయింది. మరి దేవిశ్రీ తనకు వీలు కాదని చెబితే త్రివిక్రమ్ ఎవరిని తీసుకుంటారనేది హాట్ టాపిక్ అయింది.

 Anirudh Ravichander walks out of A..Aa

‘అ..ఆ' సినిమాకు సంబంధించి ఇతర వివరాల్లోకి వెళితే...సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సమంత నటిస్తుండగా.... మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. త్రివిక్రమ్ గత సినిమా ‘అత్తారింటికి దారేది' మూవీలో కీలక పాత్ర పోషించిన నటి నదియా కూడా ఇందులో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది.

ఈ సినిమాను ప్రముఖ తెలుగు నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రముఖ సౌత్ సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రహ్మణ్యం ఈ సినిమాకు పని చేస్తున్నారు. కళ: రాజీవన్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్‌ డిజైనింగ్‌: విష్ణుగోవింద్‌, శ్రీశంకర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...పిడివి ప్రసాద్. ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.

English summary
Latest update reveals that Anirudh Ravichander has walked out of the Trivikram's project A..Aa, for reasons unknown.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu