వెయిట్ చెయ్యలేను: ‘గబ్బర్ సింగ్-2’ హీరోయిన్ ట్వీట్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ 2 లో అనీషా అంబ్రోస్ హీరోయిన్ గా ఎంపికయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘గోపాల గోపాల' చిత్రంలోనూ ఈ అమ్మడు ఓ చిన్న పాత్రలో కనిపించబోతోంది. సంక్రాంతికి గోపాల గోపాల విడుదల ఉన్న నేపథ్యంలో ఆమె ట్విట్టర్లో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
‘ఈ సంవత్సరం నాకు చాలా సంతోషమైన సంవత్సరం. ఓన్నో ఆశలు ఉన్నాయి. గోపాల గోపాల సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను. వెయిట్ చెయ్యలేక పోతున్నాను' అంటూ ట్వీట్ చేసింది. ఈ సినిమా విడుదలైతే ‘గబ్బర్ సింగ్-2' చిత్రం ప్రారంభం అవుతుందని అమ్మడు ఆశగా ఉంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'గోపాల గోపాల' చిత్రం జనవరి 9న విడుదల అవుతుందని అంతా అనుకుంటున్నాం. చిత్ర యూనిట్ కూడా గత కొన్ని రోజులుగా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. కానీ తాజాగా ఓ ట్విస్ట్ పలకరించింది. ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలు లేటవడం వల్ల జనవరి 9న కాకుండా జనవరి 11న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ కారణంగా ఇంకా అఫీషియల్ గా మీడియాలో ప్రకనటనలు ఇవ్వడం లేదు.
'గోపాల గోపాల' చిత్రానికి కిషోర్ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో పోసాని పాత్ర హైలెట్ అవుతుందని ఇన్ సైడ్ టాక్. హిందీ ఓ మై గాడ్ చిత్రం లో గోవింద నమోడె చేసిన ఈ పాత్రలో పోసాని కనిపించనున్నారు. ఈ పాత్రకు నేటివ్ టచ్ ఇచ్చి మరీ హైలెట్ చేసి కామెడీ చేయించినట్లు తెలుస్తోంది. ఆ సీన్స్ కు థియోటర్ దద్దరిల్లుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. దొంగ స్వామీగా చేసిన పోసాని తనదైన స్పెషల్ డైలాగు డెలవరితో అదరకొట్టాడని, త్వరలో ఆయన డైలాగుతో టీజర్ వదిలే అవకాసం ఉందని అంటున్నారు.
మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.


Click it and Unblock the Notifications











