రాజేష్ ఖన్నా ఫ్యామిలీపై కేసు వేసిన ప్రియురాలు

By Bojja Kumar

Rajesh Khanna-Anita Advani
ముంబై: బాలీవుడ్ ఫస్ట్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా మరణం తర్వాత.....రాజేష్ ఖన్నా ఫ్యామిలికీ, రాజేష్ ఖన్నా ప్రియురాలి(డేటింగ్ పార్టనర్) అనితా అద్వానీ మధ్య ప్రాపర్టీ గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదం నేపథ్యంలో అనితా అద్వానీ రాజేష్ ఖన్నా ఫ్యామిలీపై గృహ హింస చట్టంకింద కేసు వేసింది.

రాజేష్ ఖన్నా భార్య డింపుల్ కపాడియా, అల్లుడు అక్షయ్ కుమార్, కుతుర్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నాలపై గృహ హింస చట్టం కింద కేసు వేసింది. బాంద్రాలోని రాజేష్ ఖన్నాకు చెందిన బంగ్లా 'ఆశీర్వాద్' విషయంలోనే ఈ రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది.

దాదాపు 8 ఏళ్లుగా రాజేష్ ఖన్నాతో అనితా అద్వానీ ఆశీర్వాద్ బంగ్లాలో సహజీవనం చేస్తోంది. రాజేష్ ఖన్నా మరణం అనంతరం అనితా అద్వానీని బయటకు పంపి ఆ బంగ్లాను స్వాధీనం చేసుకోవడానికి ఖన్నా ఫ్యామిలీ ప్రయత్నిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అనితా అద్వానీ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ప్రియురాలు, సహజీవనం చేసిన మిత్రురాలు గానీ కాదని ఆయు కుటుంబ సభ్యులు అంటున్నారు. రాజేష్ ఖన్నా మరణించిన మూడు వారాల తర్వాత కుటుంబం అనితా అద్వానీ వాదనను ఖండిస్తూ బయటకు వచ్చింది. తన తండ్రి ఆస్తిలో వాటా కోరే చట్టబద్దమైన హక్కు అనితా అద్వానీకి లేదని రాజేష్ ఖన్నా కూతురు ట్వింకిల్ తన న్యాయవాది భేరు చౌదరి ద్వారా పంపిన నాలుగు పేజీల లేఖలో స్పష్టం చేశారు.

తాను పిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడి కుటుంబానికి చెందినదాన్నని, బాలీవుడ్‌లో నిర్మాతగా అడుగు పెట్టడానికి ప్రయత్నించానని అద్వానీ గతంలో చెప్పారు. తనకు ఇప్పుడు 50 ఏళ్లని, తనకు మరొకరి సహాయం అవసరమైన సమయంలో తనను ఇంటి నుంచి బయటకు పంపించేశారని ఆమె ఆరోపించారు.

బాంద్రాలోని కార్టర్ రోడ్డులో ఇంటి నుంచి తనను బయటకు గెంటేశారని ఆరోపిస్తూ అనితా అద్వానీ గృహ హింస నిరోధక చట్టం కింద తన హక్కును డిమాండ్ చేశారు. రాజేష్ ఖన్నా అంత్యక్రియల సందర్భంగా కుటుంబ సభ్యుల తీరు తనను ఇబ్బంది పెట్టేలా ఉందని ఆమె ఆరోపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X