అది మళ్లీ నేను ఫ్రూవ్ చేస్తాను.. పెళ్లిపై అంజలి కామెంట్స్ వైరల్
తెలుగమ్మాయిలు ఎక్కువగా తమిళ తెరపై రాణిస్తుంటారు. ఆ కోవలో ఐశ్వర్యా రాజేష్, శ్రీ దివ్య, అంజలి వంటి వారంతా ఉంటారు. అయితే అంజలికి మాత్రం తమిళ, తెలుగు భాషల్లో మంచి ఫాలోయింగ్ఉంది. కానీ అవకాశాలు మాత్రం ఇప్పుడు అంతగా రావడం లేదు. జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలతో అంజలి ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా వకీల్ సాబ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తోంది.

ఆ మధ్య..
తెలుగులో ఒకానొక సమయంలో అంజలి క్రేజ్ బాగానే పెరిగింది. సీనియర్ హీరోయిన్లకు మంచి చాయిస్ అనిపించుకుంది. అలా వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ల పక్కన నటించేసింది. అయితే అంజలి కెరీర్‌లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తరువాత చెప్పుకోదగ్గ చిత్రమేది రాలేదు. గీతాంజలి మాత్రం పర్వాలేదనిపించింది.

చాలా గ్యాప్..
అంజలి తెలుగు ప్రేక్షకులను చాలా గ్యాప్ తరువాత పలకరిస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న వకీల్ సాబ్ చిత్రంలో అంజలి కూడా ఓ ముఖ్య పాత్రను పోషించింది. ప్రస్తుతం అంజలి వకీల్ సాబ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె తన పెళ్లి గురించి కూడా కామెంట్ చేసింది.

ఇప్పుడే కాదు..
పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్నకు అంజలి వెరైటీగా సమాధానం ఇచ్చింది. ఇప్పుడు కెరీర్ పరంగా బిజీగానే ఉన్నాను. ముందు ఇదిపూర్తి అయ్యాక ఆలోచిద్దామని దాటవేసే ప్రయత్నం చేసింది. ఇంతలో దర్శకుడు వేణు శ్రీ రామ్ అందుకుని ఇరికించే ప్రయత్నం చేశాడు.

ఇరికించిన డైరెక్టర్..
అంటే పెళ్లయ్యాక నటించను అని చెబుతున్నావా? అని అంజలిని ప్రశ్నించాడు. అలా అని కాదు.. రెండూ ఒకే సారి ఎందుకు అని అంటూ అంజలి కవర్ చేసింది. అంతలోపు మళ్లీ డైరెక్టర్అందుకుని పెళ్లి తరువాత కూడా అందరూ బాగానే రాణిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు.

ఫ్రూవ్ చేస్తాను..
ఐశ్వర్యా రాయ్, విద్యా బాలన్, సమంత ఇలా అందరూ ఫ్రూవ్ చేశారు అంటూ వేణు శ్రీ రామ్ అన్నాడు. నేను కూడా దాన్ని ఫ్రూవ్ చేస్తాను.. పెళ్లి తరువాత కూడా నటించగలమని అంటూ అంజలి చెప్పుకొచ్చింది. అంజలి హీరో జైకి మధ్య ప్రేమబంధం ఉందంటూ కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంటుందన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











