నటి అంజలీ దేవి సంతాప సభ (ఫోటోలు)
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినిమా నటి అంజలి దేవి అనారోగ్యంతో ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నెల 13న ఆమె కన్నుమూసారు. అంజలి దేవి కోరిక మేరకు ఆమె అవయవాలను దానం చేసారు. అనంతరం ఈ నెల 16వ తేదీన చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించారు.
తెలుగు సినిమా పరిశ్రమకు అంజలి దేవి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ హైదరాబాద్ లోని ఏపీ ఫిల్మ్ చాంబర్లో సంతాప సభ ఏర్పాటు చేసారు. ఈ సభకు ప్రముఖ నటుడు కృష్ణ, నిర్మాత రామానాయుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, కైకాల సత్యనారాయణ, జమున తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.....అంజలి దేవి మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని, తెలుగు సినిమా రంగానికి ఆమె చేసిన సేవలు మరువలేనివని కొనియాడాను. ఫోటోలు, మరిన్ని వివరాలు స్లైడ్ షోలో..

అంజలి దేవి
వెండితెర సీతగా పేరుగాంచిన అంజలీ తమిళనాడు రాజధాని చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 13న తుది శ్వాస విడిచారు.

అంజలి దేవి గురించి...
అంజలి దేవి వయస్సు 86 సంవత్సరాలు. 1927 ఆగస్టు 24వ తేదీన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఆమె జన్మించారు. ఆమె అసలు పేరు అంజనీ కుమారి.

సినిమాలు
ఆమె ఐదువందలకు పైగా చిత్రాల్లో నటించారు. లవకుశ చిత్రంలో ఆమె పోషించిన సీత పాత్ర ద్వారా ఎనలేని కీర్తిని సంపాదించారు. అప్పటి నుండి వెండితెర సీతగా పేరుగాంచారు. లవకుశ, సువర్ణ సుందరి, అనార్కలీ, బండిపంతులు, బోగి మంటలు, వీరాంజనేయ, భక్త ప్రహ్లాద తదితర చిత్రాల ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందారు.

అవార్డులు
నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు, 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2006లో రామినేని ఫౌండేషన్ విశిష్ఠ పురస్కారం, 2008లో ఎఎన్నాఆర్ అవార్డులను అంజలి దేవి అందుకున్నారు.

చివరి చిత్రం
అంజలీ దేవి చివరి చిత్రం బిగ్ బాస్. తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లో నటించారు. రంగస్థలం ద్వారా నట జీవితాన్ని ఆరంభించారు. అంజలీ దేవి భర్త ఆదినారాయణ రావు సంగీత దర్శకులు. అంజలి పిక్చర్స్ పతాకంపై పలు సినిమాలను నిర్మించారు.


Click it and Unblock the Notifications











