ఖరీదైన కారులో అంజలి ఎస్కేప్, ఆ కారులో ఉన్నదెవరు?
కాగా... ఆమె అదృశ్యంపై దృష్టి సారించిన పోలీసులు దస్పల్లా హోటల్‌లో సిబ్బందిని విచారించడంతో పాటు, హోటల్‌లోని సిసిటీవీ పుటేజ్‌లను పరిశీలించారు. ఇక్కడ పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం సోమవారం ఒంటరిగా అంజలి ఫోన్ మాట్లాడుకుంటూ వేగంగా నడుచుకుంటూ వచ్చి, డోర్ దగ్గర్ ఉన్న సిబ్బంది డోర్ తీయక ముందే తనే తీసుకుని హోటల్ బయట ఆగి ఉన్న ఖరీదైన కారులో ఎక్కి వెళ్లి పోయిందని తెలుస్తోంది.
హోటల్ సిబ్బంది ఆ ఖరీదైన కారులో వెనక ఎవరో వ్యక్తి కూర్చున్నాడని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆ కారు ఎవరిది? అందులో కూర్చున్న వ్యక్తి ఎవరు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. అంజలిని తీసుకెళ్లింది ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులా? లేక ఆమె కుటుంబ సభ్యులా? ఇంకెవరైనానా? అనే విషయాలపై కూపీ లాగుతున్నారు.
మరో వైపు కుటుంబ సభ్యుల తీరుపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంజలి తమకు ఫోన్ చేసినట్లు చెబుతున్నప్పటికీ..... ఆమె ఎక్కడ ఉందనే వివరాలు చెప్పలేదని చెబుతుండటం, సెల్యూలార్ ఆపరేటర్ నుంచి డెలివరీ రిపోర్టు కూడా రాక పోవడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. త్వరలోనే అంజలి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయట పెడతామని అంటున్నారు.


Click it and Unblock the Notifications












