twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రమాదం నుంచి బయటపడ్డ హీరోయిన్ అంజలి

    By Bojja Kumar
    |

    చెన్నై: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హీరోయిన్ అంజలి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఈరోజు ఆమె చెన్నైలోని తిరుపోరులో ఓ తమిళ సినిమా షూటింగులో పాల్గొనగా విద్యుత్ షాక్ సంభవించింది. అయితే అంజలికి పెద్దగా ప్రమాదం సంభవించలేదని, ఈ గంధగోళంలో చిన్న గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో షూటింగ్ నిలిచిపోయింది.

    సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో హిట్ కొట్టిన అంజలి ప్రస్తుతం తెలుగులో రవితేజ హీరోగా రూపొందుతున్న 'బలుపు' చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. అదే విధంగా తమిళంలో వెట్టికుచ్చి, సత్తై, మద గజ రాజా చిత్రాల్లో హీరోయిన్ గా చేస్తోంది. అ విధంగా సూర్య హీరోగా రూపొందుతున్న సింగం2 చిత్రంలో అతిథి పాత్ర చేస్తోంది.

    తెలుగులో ఆమె నటిస్తున్న బలుపు చిత్రం వివరాల్లోకి వెళితే... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'బలుపు' చిత్రం రూపొందుతెంది. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్, అంజలి హీరోయిన్లుగా చేస్తున్నారు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈచిత్రం 2013 మే నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

    తమిళ సినిమాల వివరాల్లోకి వెళితే వెట్టికుచ్చి చిత్రానికి ఏఆర్ మురుగదాస్ నిర్మాత. బాలీవుడ్ హిట్ మూవీ ఢిల్లీ బెల్లి చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న 'సత్తై' చిత్రంలో అంజలి హీరో ఆర్యకు జోడీగా చేస్తోంది. మద గజరాజ చిత్రంలో అంజలి విశాల్ కు జోడీగా చేస్తోంది.

    English summary
    Seethamma Vakitlo Sirimalle Chettu fame Anjali has escaped from an accident occurred due to electric shock in a Tamil movie shooting in Chennai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X