దిక్కులేని హీరోయిన్ల చూపు బాలయ్య వైపే!
హైదరాబాద్: దిక్కులేని హీరోయిన్లకు బాలయ్యే దిక్కయ్యాడా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. అవకాశాలు లేక సతమతం అవుతున్న పలువురు హీరోయిన్లు ఇటీవల 'లెజెండ్' చిత్రం విజయవంతమైన నేపథ్యంలో బాలయ్యను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు హీరోయిన్ అంజలి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అంజలి మాట్లాడుతూ....బాలయ్యతో సినిమాలో చేయాలని ఉందని, 'మంగమ్మ గారి మనవడు' చిత్రంలో సుహాసిని పోషించిన తరహా పాత్ర చేయడం అంటే ఇష్టమని అంజలి చెప్పుకొచ్చింది. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా తాను బాలయ్యతో చేయడానికి రెడీగా ఉన్నాను అని సంకేతాలు ఇచ్చింది అంజలి.

తమిళంలో వరుస చిత్రాల్లో చేస్తూ బిజీబిజీగా గడిపిన హీరోయిన్ అంజలి ఆ మధ్య 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రం విజయం సాధించడంతో ఆమెకు అవకాశాలు భారీగానే వస్తాయని ఆశించారు. కానీ అనుకోని విధంగా ఆమె పలు వివాదాల్లో ఇరుక్కోవడం ఆమె కెరీర్‌కు శాపంగా మారింది.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం తర్వాత అంజలి తెలుగులో కేవలం 'బలుపు', 'మసాలా' చిత్రాల్లో మాత్రమే నటించింది. తమిళంలో కూడా పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. అప్పుడెప్పుడో అంజలి నటించిన 'మద గజ రాజా' అనే చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేక ఖాళీగా ఉంటోంది.


Click it and Unblock the Notifications











