హీరోయిన్ అంజలికి... పిన్ని, దర్శకుడి వేధింపులు!
కొన్ని రోజులుగా పిన్ని తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తోందని, తనను ఏటీఎం మిషన్‌లాగా వాడుకుంటున్నారని... అంజలి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఓవర్ టైమ్ వర్క్ చేయాల్సిందిగా తనపై ఒత్తిడి తెస్తున్నారని, తన డబ్బుతో వారు లగ్జరీగా జీవితం గడుపుతున్నారని తెలిపింది.
నా కెరీర్‌కు సంబంధించి దర్శకుడు కలాంజియం తన పిన్నికి సలహాలు ఇస్తున్నాడని, ఆయన మూలంగా తనకు ఈ సమస్యలు ఏర్పడ్డాయని పేర్కొంది. కలాంజియం అంజలిని తను తీసిన ఓ సినిమా ద్వారా కోలీవుడ్‌కి పరిచయం చేసాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అంజలి వారు తనపై దాడికి పాల్పడే అవకాశం ఉందని భయపడుతోంది. అందుకే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో హిట్ కొట్టిన అంజలి ప్రస్తుతం తెలుగులో రవితేజ హీరోగా రూపొందుతున్న 'బలుపు' చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. అదే విధంగా తమిళంలో వెట్టికుచ్చి, సత్తై, మద గజ రాజా చిత్రాల్లో హీరోయిన్ గా చేస్తోంది. అ విధంగా సూర్య హీరోగా రూపొందుతున్న సింగం2 చిత్రంలో అతిథి పాత్ర చేస్తోంది.


Click it and Unblock the Notifications












