వివాదాస్పద తార అంజలి తొలినాళ్లలో ఇలా... (ఫోటోఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్ : హీరోయిన్ అంజలి ఈ మధ్య పలు వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. తన పిన్ని భారతీ దేవి, తమిళ దర్శకుడు కళంజియంతో ఏర్పడ్డ విబేధాల కారణంగా ఆమె మీడియా ముందుకు వచ్చి వారిపై సంచలన కామెంట్లు చేసింది. తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, డబ్బుకోసం వేధిస్తున్నారని ఆరోపించి....అనంతరం వారి నుంచి ప్రాణభయం ఉందంటూ అజ్ఞాతంలోకి వెళ్లి అందరినీ హైరానా పెట్టింది. ఐదురోజుల అనంతరం తిరిగి వచ్చి మళ్లీ షూటింగుల్లో బిజీ అయింది. అంజలి చేసిన ఈ చర్యల కారణంగా ఆమె పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం ఆమెపై కోర్టుకెక్కగా....ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

ఈ విషయాలను పక్కన పెడితే.....అంజలి ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్. తన సెక్సీ ఒంపు సొంపులు, ముద్దబంతి లాంటి నిండైన రూపం, ఆకట్టుకునే అభినయం వెరసి ఇటు తెలుగుతో పాటు, అటు తమిళంలో పలు అవకాశాలతో బిజీబిజీగా గడుపుతోంది.

Kattradhu Thamizh అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన అంజలి తొలి సినిమాతోనే 'ఉత్తమ తెరంగ్రేట నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు, సౌత్ విజయ్ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత వరుస తమిళ చిత్రాలతో హీరోయిన్ గా ఎదిగింది. ఆమె నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన అంజలి ఆ చిత్రం విజయంతో రవితేజ 'బలుపు', వెంకటేష్ 'గరం మసాలా' చిత్రాల్లో నటించింది.

హీరోయిన్‌గా తెరకు పరిచయమైన తొలి నాళ్లలో అంజలి ఫిగర్ ఎలా ఉందో... స్లైడ్ షోలో వీక్షించండి

వివాదాస్పద తార అంజలి తొలి నాళ్లలో ఇలా... (ఫోటో ఫీచర్)

సినీ పరిశ్రమకు పరిచయమైన తొలి నాళ్లలో అంజలి....

వివాదాస్పద తార అంజలి తొలి నాళ్లలో ఇలా... (ఫోటో ఫీచర్)

ఇప్పటి వరకు అంజలి 20కి పదిగా చిత్రాల్లో నటించింది.

వివాదాస్పద తార అంజలి తొలి నాళ్లలో ఇలా... (ఫోటో ఫీచర్)

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో అంజలి నటనకు మంచి మార్కులు పడ్డాయి, వెంకీకి సరిజోడీగా పేరు తెచ్చుకుంది

వివాదాస్పద తార అంజలి తొలి నాళ్లలో ఇలా... (ఫోటో ఫీచర్)

. ప్రస్తుతం వెంకటేష్ సరసన ‘గరం మసాలా' చిత్రంలో నటిస్తోంది. హిందీ మూవీ బోల్ బచ్చన్ కు ఇది రీమేక్

వివాదాస్పద తార అంజలి తొలి నాళ్లలో ఇలా... (ఫోటో ఫీచర్)

ఆదే విధంగా రవితేజ సరసన ‘బలుపు' చిత్రంలోనూ నటిస్తోంది

వివాదాస్పద తార అంజలి తొలి నాళ్లలో ఇలా... (ఫోటో ఫీచర్)

అంజలి చేసిన ఆరోపణలపై దర్శకుడు కళంజియం ఆమెపై పరువు నష్టం దావా వేసారు

వివాదాస్పద తార అంజలి తొలి నాళ్లలో ఇలా... (ఫోటో ఫీచర్)

అంజలి విచారణకు హాజరు కావాల్సి ఉండగా హాజరు కావడం లేదు. దీంతో జూన్ 5 తప్పకుండా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది

వివాదాస్పద తార అంజలి తొలి నాళ్లలో ఇలా... (ఫోటో ఫీచర్)

ఈ సారి ఆమె హాజరు కాకపోతే అరెస్టయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు న్యాయ నిపుణులు

వివాదాస్పద తార అంజలి తొలి నాళ్లలో ఇలా... (ఫోటో ఫీచర్)

అంజలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X