సెక్సీ లుక్‌లో హీరోయిన్ అంజలి హల్‌చల్ (ఫోటోలు)
హైదరాబాద్: హీరోయిన్ అంజలి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటించినపుడు తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన 'బలుపు', 'మసాలా' చిత్రంలో గ్లామర్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఆమె రాను రాను లావెక్కిపోతుండటమే ఇందుకు కారణం.
ఆ మధ్య ఆమె బాగా లావెక్కి పోవడంతో అనేక విమర్శలు రావడతో పాటు,.....ఆమె పర్సనాలిటీకి తగిన విధంగా షకీల జీవిత చరిత్రలో నటించే అవకాశం దక్కించుకుందనే ప్రచారం కూడా జరిగింది. ఈ పరిణామాలతో అంజలి బెంబేలెత్తిపోయింది. విమర్శలకు చెక్ పెడుతూ మళ్లీ మెరుపు తీగలా సెక్సీ లుక్‌లోకి మారింది.
తాజాగా అంజలికి సంబంధించిన స్లిమ్ అండ్ సెక్సీ లుక్ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

తెరంగ్రేటం
Kattradhu Thamizh అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన అంజలి తొలి సినిమాతోనే ‘ఉత్తమ తెరంగ్రేట నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు, సౌత్ విజయ్ అవార్డు గెలుచుకుంది.

హిట్ హీరోయిన్
వరుస విజయాలు ఆ తర్వాత వరుస తమిళ చిత్రాలతో హీరోయిన్ గా ఎదిగింది. ఆమె నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి.

టాలీవుడ్ ఎంట్రీ
తెలుగు తెరంగ్రేటం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన అంజలి ఆ చిత్రం విజయంతో రవితేజ ‘బలుపు', వెంకటేష్ ‘గరం మసాలా' చిత్రాల్లో నటించింది.

తెలుగమ్మాయే
రాజోలు నుండి అంజలి స్వస్థలం ఈస్ట్ గోదావరి జిల్లా రాజోలు. 10 వతరగతి వరకు రాజోలులోనే చదువుకుంది. ఆమెకు ఇద్దరు సోదరులు.

సినిమాల్లోకి...
రాజోలు టు చెన్నై పై చదువుల నిమిత్తం చెన్నై వెళ్లిన అంజలి అదే సమయంలో సినిమాల వైపు ఆకర్షితురాలైంది. తమిళ చిత్రాల ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించింది.

ప్రస్తుతం పరిస్థితేంటి?
గత సంవత్సరం తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, బలుపు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన అంజలి...ఈ సంవత్సరం ఏ తెలుగు చిత్రంలోనూ నటించడం లేదు.

వివాదాలే
ఈ మధ్య అంజలి అనేక వివాదాల్లో ఇరుక్కుంది. తన పిన్ని భారతీ దేవి, తమిళ దర్శకుడు కళంజియంతో ఏర్పడ్డ విబేధాల కారణంగా ఆమె మీడియా ముందుకు వచ్చి వారిపై సంచలన కామెంట్లు చేసింది. తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, డబ్బుకోసం వేధిస్తున్నారని ఆరోపించి....అనంతరం వారి నుంచి ప్రాణభయం ఉందంటూ అజ్ఞాతంలోకి వెళ్లి అందరినీ హైరానా పెట్టింది.


Click it and Unblock the Notifications











