‘సీతమ్మ వాకిట్లో...’ అంజలి చెప్పేసింది...సమంత సస్పెన్స్
హైదరాబాద్ : మహేష్‌బాబుతో కలిసి వెంకటేష్ నటించిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో అంజలి, ప్రకాష్‌రాజ్, జయసుధ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి అంజలి మాట్లాడుతూ...అంజలి మాట్లాడుతూ ''ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సీత పాత్రలో కనిపిస్తాను'' అన్నారు. దాంతో అంజలి పాత్ర పేరు రివిల్ అయ్యింది. ఈ నేపధ్యంలో సమంత పాత్ర పేరు సిరి అనే సందేహాలు కలుగుతున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు టైటిల్ కావటంతో... సీతమ్మ అంజలి...సిరి...గా సమంత ఉండే అవకాసం ఉందని ఫ్యాన్స్ అంచనాలు వేసుకుంటున్నారు.
మిక్కీ జె.మేయర్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం పాటలు ఆదివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ... ''చాలా పెద్ద సినిమా ఇది. ఇద్దరు సూపర్‌స్టార్‌లతో కలిసి నటించడం నా అదృష్టం. మళ్లీ ఇలాంటి అవకాశం నాకు దొరకదు. ప్రతి ఫ్రేమ్‌లోనూ తెలుగుదనం, సంస్కృతి కనిపిస్తుంది'' అన్నారు.
చిత్రంలో వెంకటేష్, మహేష్ అన్నదమ్ములుగా చేస్తున్నారు. మహేష్ సరసన సమంత చేస్తోంది. అంటే వెంకటేష్ కు మరదలుగా చేస్తోందన్నమాట. అలాగే అంజలి..మహేష్ కు వదినగా కనిపించనుంది. ఆమె పాత్రపేరు మీదే టైటిల్ పెట్టడంతో ఆమె పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉండే అవకాసం ఉంది. ఇక అల్లరి పిల్లగా ఫస్టాఫ్ లో కొద్దిగా అణుకవ,వినయం కలబోసినట్లుగా సెకండాఫ్ లో సమంత కనిపిస్తుందని తెలుస్తోంది.
సంక్రాంతికి విడుదల అయ్యే ఈ చిత్రం 2013 బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. చిత్రంలో సమంత క్యూట్ గర్ల్ గా గ్లామర్ ఒలికిస్తూ కనిపిస్తే..ఫెరఫార్మె న్స్ తో అంజలి అదరకొడుతుందంటున్నారు. ఇప్పటికే దూకుడుతో మహేష్,సమంత కాంబినేషన్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకోవటంతో మరోసారి వెండితెరపై వీరి రొమాన్స్ కు ప్రేక్షకులు నీరాజనాలు పడతారంటున్నాురు. అంజలి గతంలో షాపింగ్ మాల్, జర్ని వంటి చిత్రాలలో నటనలో తానేంటో ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది.


Click it and Unblock the Notifications











