twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగులో జాయినైన అంజలి... (ఆన్ లొకేషన్ స్టిల్స్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లి ఇటు కుటుంబ సభ్యులను, అటు పోలీసులను, మీడియాను హైరానా పెట్టిన హీరోయిన్ అంజలి ఐదు రోజుల అనంతరం తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అంజలి 'బోల్ బచ్చన్' మూవీకి రీమేక్ గా తెలుగులో రూపొందుతున్న చిత్రం షూటింగులో జాయినైంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూణెలో జరుగుతోంది.

    అంజలి అజ్ఞాతంలోకి వెల్లడానికి కారణం ఆమె పిన్ని భారతీ దేవికి, తనకు మధ్య ఉన్న డబ్బు వ్యవహారాలకు సంబంధించిన గొడవలే కారణమని స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో అంజలి తన పిన్ని భారతీ దేవిపై, దర్శకుడు కళంజియంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

    సినిమా వివరాల్లోకి వెళితే...
    హిందీలో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్ హీరోలుగా రూపొందిన 'బోల్ బచ్చన్' చిత్రం తెలుగులో వెంకీ, రామ్ కాంబినేషన్లో రూపొందుతోంది. 'బోల్ బచ్చన్' చిత్రంలో అజయ్ దేవగన్ పోషించిన పాత్రను వెంకీ చేయబోతున్నాడు, మరో హీరో రామ్ అభిషేక్ బచ్చన్ పాత్రను పోషిస్తున్నారు.

    షూటింగులో జాయినైన అంజలి... (ఆన్ లొకేషన్ స్టిల్స్)

    షూటింగులో జాయినైన అంజలి.

    షూటింగులో జాయినైన అంజలి... (ఆన్ లొకేషన్ స్టిల్స్)

    అంజలితో పాటు నిర్మాత స్రవంతి రవి కిషోర్, అలీ.

    షూటింగులో జాయినైన అంజలి... (ఆన్ లొకేషన్ స్టిల్స్)

    అంజలితో పాటు నిర్మాత స్రవంతి రవి కిషోర్, అలీ.

    గతంలో వెంకటేష్ హీరోగా 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడు విజయ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆయన తనదైన దర్శకత్వ కోణంలో వినోదాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో వెంకీ సరసన నటించిన హీరోయిన్ అంజలి, ఈచిత్రంలో కూడా వెంకీ జోడీగా నటించబోతోంది. ఆరెంజ్ చిత్రంలో నటించిన షాజన్ పదంసీ రామ్ సరసన నటించబోతోంది. శ్రవంతి రవికిషోర్, డి. సురేష్ బాబు సంయుక్తంగా ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

    ఈ చిత్రం వెంకటేష్ కోరమీసాలతో కనిపించబోతున్నారు. గతంలో వెంకీ ఘర్షణ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కోర మీసాలతో డిఫరెంట్ లుక్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈచిత్ర యూనిట్ సభ్యులు ఒకరు మీడియాతో మాట్లాడుతూ... 'వెంకటేష్ గారు ఈ చిత్రంలో కోర మీసాలతో కనిపించబోతున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ కూడా జరిగింది' అని తెలిపారు.

    English summary
    Anjali, who hogged the headlines when she 'went missing' for 5 days has joined the regular shoot of remake of Bol Bachchan near Pune. Currently, the film's shoot is progressing at Panchgani in Maharashtra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X