ముద్దు సీన్‌తో షాకివ్వనున్న హోమ్లీ హీరోయిన్
త్వరలో ఈ అమ్మడు ప్రేక్షకులకు షాకివ్వడానికి సిద్ధం అవుతోంది. బాలీవుడ్ మూవీ 'ఢిల్లీ బెల్లీ' చిత్రానికి రీమేక్‌గా తమిళంలో రూపొందుతున్న చిత్రంలో ఆర్య, హన్సికలతో కలిసి నటిస్తున్న అంజలి.... ఈ చిత్రంలో ఆర్యతో కలిసి లిప్ లాక్ సీన్లో నటిస్తోంది. ఇటీవలే ఆర్య, అంజలిపై పలు ముద్దు సీన్లు చిత్రీకరించారు.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న కన్నన్ మాట్లాడుతూ... మొదట ముద్దు సీన్లు చేయడానికి అంజలి ఇబ్బంది పెట్టినా, సినిమాకు ముద్దు సీన్లు కీలకం కావడంతో విషయం అర్థం చేసుకుని బాగా నటించిందని, ఆమె చాలా ప్రొఫెషనల్‌గా నటించారు అని వెల్లడించారు.
హోమ్లీ పాత్రలను వదిలి ముద్దు సీన్లతో రెచ్చిపోతున్న అంజలి భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి. అంజలి తెలుగులో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో పాటు... రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పివిపి సినిమా బేనర్‌పై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న 'బలుపు' చిత్రంలో రెండో హీరోయిన్ గా ఎంపికయింది.


Click it and Unblock the Notifications












