»   » హాఫ్ సారీలో హాట్ హాట్‌గా హీరోయిన్ అంజలి (ఫోటోలు)

హాఫ్ సారీలో హాట్ హాట్‌గా హీరోయిన్ అంజలి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అంజలి హాఫ్ సారీలో హాట్ హాట్ లుక్‌లో దర్శనిచ్చింది. ప్రస్తుతం ఆమె 'గీతాంజలి' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా తీసిన స్టిల్స్ ఇవి. పింక్ కలర్ డ్రెస్సులో ఆమె మరింత అందంగా కనిపిస్తోందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

హర్రర్, హాస్య కధాంశంగా రూపొందుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా, ఎం‌వి‌వి సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్ర కథను ప్రముఖ రచయిత కోన వెంకట్ సమకూర్చారు. ప్రవీణ్ లక్కరాజు సంగీత దర్శకుడిగా, శ్రీజో గేయ రచయితగా పరిచయమవుతున్నారు.

స్లైడ్ షోలో 'గీతాంజలి' సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు, అంజలి హాట్ లుక్స్...

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

జూలై రెండో వారంలో ‘గీతాంజలి' పాటల్నీ, ఆగస్ట్ మొదటి వారంలో సినిమానీ విడుదల చేయబోతున్నారు.

బ్రహ్మానందం

బ్రహ్మానందం

టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఒకరు ఇందులో ఓ పాట చేయబోతోంది. బ్రహ్మానందం మీద చిత్రీకరించే ఈ పాట హైలైట్‌గా ఉంటుందట.

నిజంగా అలా ఉంటుందా?

నిజంగా అలా ఉంటుందా?

'అనుష్కకు 'అరుంధతి'లా, జ్యోతికకు 'చంద్రముఖి'లాగా అంజలి కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచే సినిమా ఇదని అంటున్నారు

ఊహకు అందని విధంగా...

ఊహకు అందని విధంగా...

ఎవ్వరూ ఊహించని విధంగా కథా కథనాలు ఉంటాయి. వినోదానికి ప్రాధాన్యముంటుంది. ఇప్పటివరకూ వచ్చిన హారర్‌ కామెడీ చిత్రాల్లోనే ఇదొక స్పెషల్‌ మూవీగా నిలిచిపోతుందని రచయిత కోన వెంకట్ చెబుతున్నారు.

అంజలి హార్డ్ వర్క్

అంజలి హార్డ్ వర్క్

అంజలి నిర్మాత సత్యనారాయణ మాట్లాడుతూ "అంజలి ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేనిది. చిక్‌మంగుళూరులో వర్షంలో తడుస్తూ, తక్కువ ఉష్ణోగ్రతలో ఆమె మూడు రోజుల పాటు ఓ పాటను చేశారు'' అన్నారు.

నటీనటులు

నటీనటులు

ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, హర్ష వర్దన్ రాణె, రావు రమేశ్, అలీ, రఘుబాబు, పృథ్వీ, ఝాన్సీ, వెన్నెల కిశోర్, శ్రవణ్, మధునందన్, సీవీఎల్ నరసింహారావు, దీక్షితులు నటిస్తున్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి రచనా సహకారం: అనిల్ రావిపూడి, వెంకటేశ్ కిలారు, కథా విస్తరణ, స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సహ నిర్మాత: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల.

English summary
Anjali Latest Photo Stills in Half Saree. 'Geethanjali' starring Anjali in the lead role has neared completion. The audio launch of the movie will be held on July 2nd and the theatrical release would be in August. Special Attraction in 'Geethanjali' is the voice over provided by ace filmmaker VV Vinayak and an Item Number by one of the Star Heroines.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu