»   »  అపుడు కేసులు, ఇపుడు హీరోయిన్ అంజలి లాయర్

అపుడు కేసులు, ఇపుడు హీరోయిన్ అంజలి లాయర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ చిత్ర సీమలో మంచి ఫాంలో ఉన్న సమయంలో హీరోయిన్ అంజలి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తన పిన్ని, తమిళ దర్శకుడు కళంజియంతో గొడవల కారణంగా అప్పట్లో ఆమెను కోర్టు కేసులు చుట్టుముట్టాయి. ఆ గొడవల కారణంగా ఆమె తమిళ చిత్ర సీమకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ గొడవలేమీ లేకుంటే ఇప్పటికీ ఆమె అక్కడ స్టార్ హీరోయిన్ అయ్యేది. తమిళ సినీ పరిశ్రమకు కొంత కాలం దూరం అయినా తెలుగులో ఆమె మంచి అవకాశాలే దక్కించుకుంది. అంజలి ఇపుడు మళ్లీ తమిళ చిత్రసీమలో రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది.

Anjali in Lawyer role

‘అప్ప మక్కరు' అనే సినిమాతో పాటు ‘మాప్పిల సింగం' అనే చిత్రంలో నటిస్తోంది. అప్ప మక్కరు చిత్రంలో జయం రవి హీరో. సూరజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మాప్పిల సింగం చిత్రంలో విమల్ హీరోగా చేస్తున్నాడు. రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మాప్పిల సింగం చిత్రంలో అంజలి లాయర్ పాత్రలో నటిస్తోంది.

ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన ఆమె లాయర్ లుక్ విడుదల చేసారు. ఆ మధ్య కేసులతో సతమంతం అయిన అంజలి....ఇపుడు లాయర్ పాత్రలో నటిస్తుండటం గమనార్హం. దీంతో పాటు కన్నడలో ధీర రణవిక్రమ చిత్రంలో నటిస్తోంది. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయి కానీ గీతాంజలి తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు ఫైనల్ కాలేదు.

Read more about: anjali, అంజలి
English summary
Mapla Singam is an upcoming Indian Tamil-language romantic comedy film directed by Rajasekhar. Don Ashok has penned the dialogs. N. R. Raghunanthan has scored the music. The film features Vimal and Anjali in the leading roles, with Soori in a supporting role.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu