Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హాట్ హాట్‌గా, యాక్షన్ హీరోయిన్గా అంజలి.. స్పెషల్‌గా లక్ష్మీరాయ్!
Recommended Video
అతి తక్కువ కాలంలోనే చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకున్న అంజలి ప్రధాన పాత్రధారిగా ఆనందభైరవి చిత్రం రూపుదిద్దుకోనుంది. గతంలో అద్భుతమైన విజయాన్ని అందుకొన్న టైటిల్ ఈ సినిమాలో లక్ష్మీరాయ్ ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. యువ కథానాయకుడు అంజలి కి జోడి గా నటించనున్నారు . ప్రతిభావంతుడైన యువ దర్శకుడు కర్రి బాలాజీ దర్శకత్వంలో హరేవన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రమేశ్‌రెడ్డి ఇటికెల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సరికొత్త పాయింట్‌తో, భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకొనే ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం కానుంది.
యాక్షన్ హీరోయిన్గా అంజలి
హీరోయిన్ అంజలి మాట్లాడుతూ.. దర్శకుడు బాలాజీగారు చెప్పిన కథ నచ్చి ఆనందభైరవి సినిమా చేస్తున్నాను. తొలిసారిగా యాక్షన్ పాత్ర పోషిస్తున్నాను. సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాను అని చెప్పారు.
సింగర్ చిన్మయి మీద వేటు: #మీ టూ ఉద్యమం ఎఫెక్టేనా? మంచు లక్ష్మి సపోర్ట్!
ఛాలెంజింగ్ రోల్లో లక్ష్మీరాయ్
సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న లక్ష్మీరాయ్ మాట్లాడుతూ...ఇందులో నేను ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాను. ఇంతవరకూ నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. నటించడానికి బాగా స్కోప్ ఉన్న పాత్ర చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.
ప్రేక్షకులకు నచ్చే విధంగా
ఆనందభైరవి సినిమా గురించి నిర్మాత రమేశ్‌రెడ్డి ఇటికేల మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులు కోరుకొనే అన్ని అంశాలూ అందులో ఉండటంతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను. డిసెంబర్లో లాంఛనంగా షూటింగ్ ప్రారంభిస్తాం. జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది అని తెలిపారు.
వినోదం, ఉల్లాసం ఉంటూ
చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ.. సమాజంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకొంటుంది. హైదరాబాద్, వైజాగ్, కేరళలోని పలు అందమైన లొకేషన్లలో షూటింగ్ చేస్తాం. వినోదం, ఉల్లాసం ఉంటూ ఉత్కంఠభరితంగా సినిమా సాగుతుంది. ముఖ్యంగా అంజలి పాత్ర ప్రతి ఇంట్లో ఉండు అమ్మాయిని గుర్తు చేసేలా ఉంటుంది అని చెప్పారు.
నటీనటులు.. సాంకేతిక వర్గాలు..
రవికిషన్, బాహుబలి ప్రభాకర్, ధన్‌రాజ్, సత్యం రాజేశ్, ఆశిష్ విద్యార్ధి, బ్రహ్మాజీ, శ్రీహర్ష తదితరులు నటించే ఈ చిత్రానికి స్ర్కిప్ట్ కో-ఆర్డినేటర్ః మధు విప్పర్తి, సంగీతంః మణిశర్మ, ఛాయాగ్రహణంః పి.జి.విందా, ఎడిటింగ్ః చోటాకె. ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ః పరిటాల రాంబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ఃసురేశ్బాబుదత్తి, నిర్మాతః రమేశ్‌రెడ్డి ఇటికేల, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వంఃకర్రిబాలాజీ.