వర్ధమాన హీరోతో అంజలి ప్రేమ వ్యవహారం?

By Bojja Kumar

హైదరాబాద్ : హీరోయిన్ అంజలి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. 2 రోజులుగా కనపడకుండా పోయిన అంజలి ఈ రోజు ఉదయం అజ్ఞాతం వీడింది. తాను క్షేమంగానే ఉన్నానని తన తల్లికి ఫోన్ చేసి వెల్లడించింది. అయితే పోలీసులు మాత్రం ఆమె ఎక్కడ ఉందనే వివరాలు ఇంకా తెలియలేదంటున్నారు.

ఇదిలా ఉండగగానే మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఓ వర్ధమాన హీరోతో అంజలి ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంజలిని హింసించి డబ్బుకోసం వేధిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె పిన్ని భారతీదేవి కూడా ఆమె ప్రేమ వ్యవహారం గురించి మీడియాకు వెల్లడించారు. తన లవర్ మాట వినే ఆమె తనపై ఆరోపణలు చేస్తుందని భారతీ దేవి ఆరోపించారు. అయితే అతను ఎవరో మాత్రం తనకు తెలియదంటోంది భారతీ దేవి.

దీంతో అంజలి మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులు ఆమె ఫోన్ కాల్స్‌పై లిస్టుపై ఆరా తీస్తున్నారు. అంజలి అదృశ్యం వెనక ఆ హీరో హస్తం ఉందా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ హీరో ఎవరు? అనే విషయం సర్వత్రా ఆసక్తిగా మారింది.

కాగా....అంజలి ఈ రోజు బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న 'బోల్ బచ్చన్' తెలుగు రీమేక్ సినిమా షూటింగుకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మీడియా వారు షూటింగ్ జరిగే ప్రాంతంలో పడిగాపులు కాస్తున్నారు. మరి అంజలి బయటకు వస్తేగానీ పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

అదృశ్యం కావడానికి ముందు అంజలి మీడియాతో మాట్లాడుతూ... '' నా వెంటే ఉంటూ నాకు గోతులు తవ్వారని, ఇప్పుడు నా వద్ద చిల్లిగవ్వ లేకుండా నా ఆస్తి అంతా మింగేశారని, ఇప్పుడు చిత్ర హింసలు పెడుతున్నారని" తన పిన్ని భారతీ దేవిపై మండి పడింది. తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించింది. నా సొంత అక్క, అన్నలతో కూడా మాట్లాడనీయకుండా చిత్రహింసలు పెడుతున్నారని, నా ప్రాణాలకు వీరి నుండి ముప్పు ఉందని, ఏం జరిగినా వీరిదే భాధ్యత అని తేల్చిచెప్పింది. వీరితో పాటు దర్శకడు కలంజియం కూడా నన్ను మోసం చేశారని, నేను మేజర్ ను అయ్యాను కాబట్టి వీరికి దూరంగా ఉండాలని హైదరాబాద్ లో ఉంటున్నానను' మీడియాకు తెలిపింది. ఆ తర్వాత కొన్ని గంటలకే అంజలి అదృశ్యం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X