హైదరాబాద్‌లో అంజలి, హాజరు పరచాలని కోర్టు ఆదేశం

By Bojja Kumar

హైదరాబాద్: తన పిన్ని భారతీదేవి తనను వేధిస్తోందని, వారి నుంచి ప్రాణభయం ఉందని మీడియా ప్రకటన చేసిన హీరోయిన్ అంజలి సోమవారం ఉన్నట్టుండి హైదరాబాద్ లో అదృశ్యం అయిన సంగతి తెలిసిందే. ఎవరికీ కనిపించకుండా పోయి పోలీసులతో పాటు ఇటు కుటుంబ సభ్యులను, అటు నిర్మాతలను హైరానా పెట్టిన అంజలి రెండు రోజులు గడిచిన తర్వాత తాను క్షేమంగానే ఉన్నాననే సమాచారం కుటుంబానికి చేరవేసింది. దీంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు.

కాగా... అంజలి శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రంలోగా ఆమె మీడియాతో సమావేశమై అన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. పోలీస్ స్టేషన్లో తనపై మిస్సింగ్ కేసు నమోదైన నేపథ్యంలో పోలీసుల ముందు హాజరయ్యే అవకాశం ఉంది.

మరో వైపు... అంజలిని రెండు వారాల్లోగా కోర్టులో హాజరు పరుచాలని మద్రాసు హైకోర్టు శుక్రవారం చెన్నై పోలీసులను ఆదేశించింది. అంజలి అపాయంలో ఉందని, ఆమెను రక్షించాలని ఆమె పిన్ని భారతీదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఓవరాల్‌గా అంజలి వ్యవహారం పరిశీలిస్తే కుటుంబ కలహాల వల్లనే అంజలి ఇంటిని విడిచి అదృశ్యం అయినట్లు స్పష్టం అవుతోంది. అంజలి అసలు తల్లి, ఆమె పెంచిన తల్లి మధ్య అంజలి విషయంలో విబేధాలు వచ్చాయని, తదనంతరం ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో అంజలి తన పిన్ని భారతీదేవిపై ఆరోపణలు చేయడం, ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంజలి మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు తెలియజేస్తే ఈ మిస్టరీ వెనక ఉన్న అసలు వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X