పబ్బు లొల్లి: అంజలి కూడా అందులో చేరింది
హైదరరాబాద్: హీరోయిన్ అంజలి ఇటీవల పబ్ గొడవతో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఆమె పబ్బులో తాగి గొడవ చేసిందని, నానా హంగామా చేసిందంటూ మీడియాలో వార్తలొచ్చాయి. ఆమె వివరణ ఇచ్చే లోపే ఈ గొడవ సౌతిండియా మొత్తం పాకింది. తాను తర్వగా వివరణ ఇచ్చి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఆమె ఆలోచన. తాను ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో లేక పోవడం వల్లనే తన వివరణ చాలా ఆలస్యంగా జనాల్లోకి వెళ్లిందని భావించిన ఆమె....తాజాగా నిన్న ట్విట్టర ఖాతా ఓపెన్ చేసింది.
ఇకపై తన గురించి ఎలాంటి పుకార్లు వచ్చినా....వెంటనే ఖండించడం, తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకోవడానికి ట్విట్టర్ ను ఆమె వేదిక ఎంచుకుందని స్పష్ట మవుతోంది. @yoursanjali ఐడితో ఆమె ట్విట్టర్ అకౌండ్ క్రియేట్ చేసారు. హే...స్టార్ట్స్ ట్వీటింగ్ అంటూ తొలి ట్వీట్ చేసారు. తన క్లోజ్ ఫ్రెండ్ నీరజ కోన తో దిగిన ఫోటో కూడా పోస్టు చేసారు.

పబ్బు గొడవ గురించి అంజలి వివరణ
అయితే ఈ ఘటనపై అంజలి వివరణ ఇచ్చింది. తాను మద్యం సేవించలేదని, గొడవ పడలేదని తెలిపింది. అంజలి మాట్లాడుతూ...‘నా స్నేహితురాలి బర్త్ డే పార్టీ ఉంటే రాత్రి 9 గంటల ప్రాంతంలో పబ్‌కి వెళ్లాను. అదే సమయంలో కొందరు మీడియా వారు ఉన్నారు. నన్ను ఆ సమయంలో ఫోటోలకు ఫోజులు ఇవ్వమని అడిగారు. మాది ప్రైవేట్ ఫంక్షన్ కావడంతో వద్దని రిక్వెస్ట్ చేసాను. అరగంట తర్వాత సర్వీస్ లిఫ్టు ద్వారా అక్కడి నుండి వెళ్లి పోయాను. కానీ మరునాడు మీడియాలో వార్తలు చూసి షాకయ్యాను. నేను తాగి గొడవ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ అధారంలేని రూమర్లు. నేను అసలు డ్రింక్ చేయలేదు. నాకు బాయ్ ఫ్రెండు కూడా లేడు. ఈ వార్తలు ఎవరు స్పెండ్ చేసారో తెలియదు. నేను హల్ చల్ చేసినట్లు చెబుతున్నారు. కావాలంటే పబ్ లో సీసీటీవీ పుటేజి చెక్ చేసుకోండి. అనవసరంగా నన్ను అబాసుపాలు చేయొద్దు' అని అంజలి చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











