రవితేజ 'బలుపు' లో వెంకి హీరోయిన్ ఖరారు
హైదరాబాద్ : రవితేజ తాజా చిత్రం 'బలుపు'. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కి చోటు దక్కింది. పి.వి.పి.సినిమా సంస్థ రవితేజ హీరోగా 'బలుపు' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకుడు. ప్రసాద్ వి.పొట్లూరి నిర్మాత. ఇందులో హీరోయిన్ గా శ్రుతిహాసన్‌ని ఎంచుకొన్నారు. మరో నాయికగా అంజలి నటించబోతోంది. 'షాపింగ్‌మాల్', 'జర్నీ' చిత్రాలతో తెలుగువారికి చేరువైంది అంజలి. ప్రస్తుతం ఆమె వెంకటేష్ సరసన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో నటిస్తోంది.
ఈ చిత్రంలో రవితేజ క్యారెక్టర్ కామెడీని పండిస్తూ యాక్షన్ సీన్లతో అదరగొట్టేదిగా ఉంటే...శృతి హాసన్ క్యారెక్టర్ రవితేజకు తగిన జోడీగా ఎంటర్ టైన్మెంట్ పంచుతూ అందాల ఆరబోతతో గ్లామరస్‌గా ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు గోపీ చంద్ ఈ చిత్రం కోసం ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్ స్క్రిప్టును రెడీ చేస్తున్నాడు.
ఇక రవితేజ రీసెంట్ చేసిన 'దేవుడు చేసిన మనుషులు'చిత్రం డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సారొస్తారా' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాల తర్వాత 'బలుపు' సెట్స్ మీదకు వెళ్లనుంది. 'బలుపు' ఈ నెల 25న లాంఛనంగా మొదలవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన కథ, సంగీత చర్చలు పూర్తయ్యాయి. కథ: కోన వెంకట్, బాబి; సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











