»   » వర్షంలో హీరోయిన్ అంజలి హాట్ లుక్...(ఫోటోలు)

వర్షంలో హీరోయిన్ అంజలి హాట్ లుక్...(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోయిన్ అంజలి ఈ మధ్య పలు వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. తన పిన్ని భారతీ దేవి, తమిళ దర్శకుడు కళంజియంతో ఏర్పడ్డ విబేధాల కారణంగా ఆమె మీడియా ముందుకు వచ్చి వారిపై సంచలన కామెంట్లు చేసింది. తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, డబ్బుకోసం వేధిస్తున్నారని ఆరోపించి....అనంతరం వారి నుంచి ప్రాణభయం ఉందంటూ అజ్ఞాతంలోకి వెళ్లి అందరినీ హైరానా పెట్టింది.

ఈ విషయాలను పక్కన పెడితే.....అంజలి ప్రస్తుతం కెరీర్ పరంగా కాస్త వెనక బడిందనే చెప్పాలి. తన సెక్సీ ఒంపు సొంపులు, ముద్దబంతి లాంటి నిండైన రూపం, ఆకట్టుకునే అభినయం వెరసి ఇటు తెలుగుతో పాటు, అటు తమిళంలో పలు అవకాశాలతో బిజీబిజీగా గడిపిన ఆమెకు ఈ సంవత్సరం మాత్రం అవకాశాలు తగ్గాయి.

గత సంవత్సరం తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, బలుపు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన అంజలి...ఈ సంవత్సరం ఏ తెలుగు చిత్రంలోనూ నటించడం లేదు. తమిళంలో ఆమె గత సంవత్సరం నటించిన చిత్రం త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది. కొత్త ప్రాజెక్టులేవీ ఓకే కాలేదు.

తాజాగా ఇంటర్నెట్లో అంజలికి సంబంధించి వర్షం స్టిల్స్ హల్ చల్ చేస్తున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

తెరంగ్రేటం

తెరంగ్రేటం

Kattradhu Thamizh అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన అంజలి తొలి సినిమాతోనే ‘ఉత్తమ తెరంగ్రేట నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు, సౌత్ విజయ్ అవార్డు గెలుచుకుంది.

వరుస విజయాలు

వరుస విజయాలు

ఆ తర్వాత వరుస తమిళ చిత్రాలతో హీరోయిన్ గా ఎదిగింది. ఆమె నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి.

తెలుగు తెరంగ్రేటం

తెలుగు తెరంగ్రేటం

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన అంజలి ఆ చిత్రం విజయంతో రవితేజ ‘బలుపు', వెంకటేష్ ‘గరం మసాలా' చిత్రాల్లో నటించింది.

రాజోలు నుండి

రాజోలు నుండి

అంజలి స్వస్థలం ఈస్ట్ గోదావరి జిల్లా రాజోలు. 10 వతరగతి వరకు రాజోలులోనే చదువుకుంది. ఆమెకు ఇద్దరు సోదరులు.

రాజోలు టు చెన్నై

రాజోలు టు చెన్నై

పై చదువుల నిమిత్తం చెన్నై వెళ్లిన అంజలి అదే సమయంలో సినిమాల వైపు ఆకర్షితురాలైంది. తమిళ చిత్రాల ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించింది.

English summary
Anjali is an Indian film actress and model, who predominantly appears in Tamil films along with few Telugu movies. Following a stint in modelling, she was cast in starring roles in two low-profile Telugu productions, before gaining attention with her critically acclaimed performance as Anandhi in Kattradhu Thamizh (2007), for which she received the Filmfare Award for Best Female Debutante.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu