»   » అంజలి ఇష్యూ: ఈయన అడ్డుకుంటే, ఆయన రమ్మంటున్నాడు!

అంజలి ఇష్యూ: ఈయన అడ్డుకుంటే, ఆయన రమ్మంటున్నాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అంజలి, తమిళ దర్శకుడు కళంజియం వివాదం గురించి అందరికీ తెలిసిందే. పిన్నితో మనస్పర్థల కారణంగా గత ఏడాది మార్చిలో అనూహ్యంగా హైదరాబాద్ వెళ్లిపోయిన ఆమె తన పిన్ని, దర్శకుడు కళంజియం వలన తనకు ప్రాణానికి ముప్పు ఉందని ఆరోపణలు చేసారు.

అయితే కళంజియం సినిమా 'ఊరు చుట్టి పురాణం' చిత్రంలో కొన్ని రోజులు నటించిన అంజలి ఆ చిత్రాన్ని పూర్తి చేయలేదు. అంజలి పూర్తి చేయకుండా ఇబ్బందులు పెడుతుందటూ దర్శకుల మండలిలో కళంజియం ఫిర్యాదు కూడా చేసారు. దాంతో దర్శకుల సంఘం ఈ అమ్మడిపై బ్యాన్‌ విధించిందని ప్రచారం జరిగింది. కాని తాజా సమాచారం ప్రకారం అంజలిపై బ్యాన్‌ విధించలేదని తెలుస్తోంది.

Anjali's confirmed for Jayam Ravi film

చాలా రోజుల క్రితమే అంజలి మరో సినిమాకు కూడా కమిట్ అయింది. సూరజ్ దర్శకత్వంలో జయంరవి హీరోగా ఈ చిత్రం. బ్యాన్ వార్తల నేపథ్యంలో ఈ చిత్రం నుండి అంజలిని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. అయితే దర్శకుడు సూరజ్ స్పందింస్తూ ఆమెను తొలగించలేదని తెలిపారు. అంజలిని తొలగించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అంజలినే తమ చిత్ర హీరోయిన్ అని సూరజ్ స్పష్టం చేశారు.

అంజలి మళ్లీ కోలీవుడ్‌లోకి వస్తే ముందు నా చిత్రం పూర్తి చేయాల్సిందేనని, లేక పోతే ఆమె ఎంట్రీని అడ్డుకుంటానని ప్రకటించారు. తన చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత అంజలి ఇతర తమిళ చిత్రాల్లో నటించాలని ఆయన పట్టుబడుతున్నారు. మరి కళంజియంతో అంజలి కలిసి పని చేస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

English summary
Anjali's confirmed for Jayam Ravi film. Suraaj will be directing this yet to be titled Jayam Ravi starrer to be produced by Lakshmi Movie Makers. The director has recently confirmed the news and also denied the reports that said Anjali cannot be roped in for films in Kollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu