మంచి టైటిల్... పాడు చేయకండి
హైదరాబాద్ : కొన్ని సినిమాలు టైటిల్స్ ప్రేక్షకుల గుండెల్లో అలా నిలిచిపోతాయి. ఆ టైటిల్స్ వినగానే ఆ సినిమానో, లేక పాత్రో గుర్తుకు వచ్చి ఆనందపడుతూంటారు. సాధారణంగా అలా జనాల్లో నిలిచిపోయిన చిత్రాల టైటిల్స్ జోలికి ఎవరూ వెళ్లరు. కానీ కోన వెంకట్ అలాంటి సాహసం చేస్తున్నారు. రీసెంట్ గా పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న నాగార్జున సూపర్ హిట్ ప్రేమ కావ్యం 'గీతాంజలి' టైటిల్ తో చిత్రం చేస్తున్నారు. దాంతో సినిమా టైటిల్ ని పాడుచేయకుండా, దానికి తగ్గ కథ,కథనాలతో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
అంజలి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'గీతాంజలి'. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలో కనిపిస్తారు. రాజ్‌కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మాత. కోన వెంకట్ సమర్పకులు. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది. టైటిల్, అంజలి, కోన వెంకట్ కాంబినేషన్ తో ఈ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వచ్చింది.
దర్శకుడు మాట్లాడుతూ ''ఎవరూ వూహించని కథ కథనాలతో రాబోతున్న చిత్రమిది. హారర్, వినోదం కలగలిపి ఉంటాయి. అంజలికి నటిగా మంచి పేరు తీసుకొచ్చే చిత్రమవుతుంది'' అన్నారు. అలాగే ఈ చిత్రంలో అంజలి రెండు పాత్రలను పోషిస్తోందని తెలుస్తోంది. కాలేజీకి వెళ్ళే అమ్మాయిగా, గృహిణిగా ఈ పాత్ర సాగుతుందని చెప్తున్నారు.

కోన వెంకట్ మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మించాలి. ఆయనకు వేరే కమిట్‌మెంట్స్ వుండటంతో ఈ సినిమా బాధ్యత నామీదపడింది. చాలా కాలంగా సినిమా చేయాలని ఎదురుచూస్తున్న ఎం.వి.వి. సత్యనారాయణకు ఈ చిత్రకథ నచ్చడంతో గీతాంజలి చిత్రాన్ని సైలెంట్‌గా ప్రారంభించాం. అంజలి లేకపోతే ఈ సినిమా లేదు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్రహ్మానందం పాత్ర కీలకం అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ''80 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వస్తోంది. వచ్చే నెల ద్వితీయార్ధంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము''అన్నారు. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌రాణే, బ్రహ్మానందం, రావు రమేష్, మధునందన్, షకలక శంకర్ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి కళ: రఘు కులకర్ణి, కూర్పు: ఉపేంద్ర, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్.


Click it and Unblock the Notifications











