లేట్‌నైట్ పార్టీలో హీరోయిన్ అంజలి హల్‌చల్ (ఫోటోలు)
హైదరాబాద్: హీరోయిన్ అంజలి ఈ మధ్య ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పిన్నితో పాటు తమిళ దర్శకుడు కళంజియంపై అంజలి ఆరోపణలు చేయడంతో వివాదం కోర్టు వరకు వెళ్లింది. మరో వైపు కళంజియం దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒప్పుకుని డుమ్మా కొట్టిన కారణంగా ఆమెపై బ్యాన్ విధిస్తారనే ప్రచారం కూడా సాగింది.
తాజాగా అంజలి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమెకు సంబంధించిన లేట్ నైట్ పార్టీ ఫోటోలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. పలువురు ఫిల్మ్ మేకర్స్‌తో ఆమె డాన్స్ చేస్తున్న ఫోటోలు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ ఫోటోలు ఇప్పటివి కాదని, గత కొన్ని నెలల క్రితం జరిగిన పార్టీకి సంబంధించినవని అంటున్నారు.

డాన్స్ చేస్తున్న అంజలి
తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఓ ఫిల్మ్ మేకర్‌తో అంజలి డాన్స్ చేస్తున్న దృశ్యం ఇక్కడ చూడొచ్చు.

ప్రైవేట్ పార్టీ
ఇదంతా ఓ ప్రైవేట్ పార్టీకి సంబంధించినదని తెలుస్తోంది. ఓ నటుడితో కలిసి అంజలి డాన్స్ చేస్తున్న దృశ్యం.

అంజలి
ఇంటర్నెట్లో అంజలికి సంబంధించిన ఈ ఫోటోలు ఇపుడు చర్చనీయాంశం అయ్యాయి.

హీరోయిన్ అంజలి
ఈ ప్రైవేట్ పార్టీ సందర్భంగా కెమెరాకు ఫోజులు ఇస్తున్న హీరోయిన్ అంజలి
ఫోటోలు, సమాచారం www.filmibeat.com నుండి సేకరించబడింది


Click it and Unblock the Notifications











