మా ఇంట్లో దెయ్యం ఉంది.. రాత్రి 12 గంటలు కాగానే.. షాకింగ్ విషయాలు చెప్పిన అంజలి
చూడచక్కని అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అంజలి.. దెయ్యానికి భయపడిందట. ఇదేదో సినిమాలో అనుకుంటే పొరపాటే! నిజంగా నిజ జీవితంలోనే. పైగా ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే వెల్లడించింది. తాజాగా జరిగిన అలీతో సరదాగా కార్యక్రమంలో ఈ విషయం తెలిపింది అంజలి. వివరాల్లోకి పోతే..

దెయ్యానికి భయపడ్డా.. అంజలి ఓపెన్ కామెంట్స్
తెలుగు, తమిళ భాషల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అంజలి. హారర్ సినిమాలు చేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది. 'గీతాంజలి' సినిమాలో దెయ్యం పాత్రతో నటించి ప్రేక్షకులను భయపెట్టింది కూడా. అలాంటి అంజలి నిజ జీవితంలో దెయ్యానికి భయపడ్డానని చెప్పడంతో అంతా షాకవుతున్నారు.

రాత్రి 12 గంటలు కాగానే ఆ దెయ్యం
తాను ఇప్పుడున్న ఇంట్లో కాకుండా అంతకుముందు వేరొక ఇంట్లో ఉండే దానినని, ఆ ఇంట్లో దెయ్యం ఉండేదని చెప్పింది అంజలి. రాత్రి 12 గంటలు కాగానే ఆ దెయ్యం వచ్చి నన్ను నిద్ర లేపుతున్నట్లుగా అనిపించేదని ఆమె చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

రాత్రికి రాత్రే హోటల్‌కి వెళ్లి.. అక్కడే
ఆ దెయ్యం భయంతో ఒక్కోసారి రాత్రికి రాత్రే హోటల్‌కి వెళ్లి.. అక్కడే రూమ్ తీసుకుని పడుకున్న రోజులున్నాయని అంజలి చెప్పుకొచ్చింది. ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు భయంతోనే గడిపానని, చివరకు ఆ ఇల్లు ఖాళీ చేసేసి వేరే ఇంటికి మారిపోయానని ఆమె తలిపింది. ప్రస్తుతం అంతా ప్రశాంతగా ఉందని అంజలి చెప్పింది.

అనుష్కతో అంజలి.. నిశ్శబ్దం
ప్రస్తుతం అంజలి 'నిశ్శబ్దం' సినిమాలో నటిస్తోంది. అనుష్క లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో అంజలి పవర్‌ఫుల్ క్రైం డిటెక్టివ్ ఏజెంట్ 'మహా'గా కనిపించనున్నట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటికే విడుదలైన ఈమె లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

జనవరి 24.. యూనిట్ ప్లాన్స్
కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న నిశ్శబ్దం సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 24న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్.


Click it and Unblock the Notifications











