సెల్ఫీలతో హీరోయిన్స్ రచ్చ డిక్టేటర్ సెట్

By Srikanya

హైదరాబాద్‌: బాలకృష్ణ హీరోగా శ్రీవాస్‌ తెరకెక్కిస్తున్న 'డిక్టేటర్‌' చిత్ర సెట్స్‌లో నటి అక్ష సందడి చేశారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న అంజలితో కలిసి సరదాగా సెల్ఫీలు తీసుకున్నారు.

'ఇద్దరు అమ్మాయిలకు కెమెరా ఇచ్చి ఒంటరిగా వదిలితే ఇలాగే చేస్తుంటారు' అని అక్ష తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ సెల్ఫీని ట్వీట్‌ చేస్తూ.. వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం 'డిక్టేటర్‌' షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. అక్కడే ఐటమ్ సాంగ్ కూడా చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. డిసెంబర్ మూడో తేదీ వరకు 'డిక్టేటర్‌' షూటింగ్ దేశరాజధానిలోనే సాగనుంది.

Anjali selfie with Aksha @ Dictator sets

నందమూరి బాలకృష్ణ, అంజలి నటిస్తున్న కొత్త చిత్రం ' 'డిక్టేటర్‌'‌'. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో ప్రక్క ఆడియోని రెడీ చేసి, డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇది బాలకృష్ణకు 99వ చిత్రం కావడం విశేషం.

నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X