గీతాంజలి మళ్లీ వచ్చింది ట్విట్టర్ రివ్యూ: అంజలి మూవీకి అలాంటి టాక్.. ఇంతకీ భయపెట్టిందా అంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో హర్రర్ కామెడీతో వచ్చే సినిమాలకు అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఇలా ఇప్పటి వరకూ ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో చాలా వరకూ విజయాన్ని అందుకున్నాయి. అలాంటి వాటిలో 'గీతాంజలి' ఒకటి. అంజలి ప్రధాన పాత్రలో పోషించిన ఈ చిత్రం సక్సెస్ అవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమాను చేశారు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రానికి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో మీరే చూసేయండి!

గీతాంజలి మళ్లీ వచ్చిందంటూ:తెలుగు నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన హర్రర్ కామెడీ మూవీనే 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. శివ తుర్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఇందులో సునీల్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, సత్య, అలీ, రవిశంకర్, శైలజా ప్రియ తదితరులు నటించారు. ఈ మూవీకి ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ ఇచ్చాడు.

Anjali Starrer Geethanjali Malli Vachindi Movie Twitter Review

అలాంటి కథతో ఇంట్రెస్టింగ్:సినిమా షూటింగ్ కోసం ఓ పాడుపడ్డ ఇంట్లోకి కొంత మంది వెళ్లడం.. అక్కడ వాళ్లకు నిజమైన దెయ్యాలు కనిపించడం.. ఆ తర్వాత నుంచి వాళ్లకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటి నుంచి అందరూ ఎలా బయటపడ్డారు? అనే అంశాలతో తెరకెక్కిన చిత్రమే 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. దీంతో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ పెరగడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ఆ ట్విస్ట్ హైలైట్‌గా ఉందని:తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమా ఇప్పటికే చాలా చోట్ల ప్రదర్శితం అయింది. దీన్ని చూసిన ఓ నెటిజన్ 'గీతాంజలి మళ్లీ వచ్చింది నవ్వించే మూవీ. కామెడీ స్టార్లు అందరూ కలిసి నటించిన ఈ చిత్రం ఇంటర్వెల్ ట్విస్ట్ బోనస్ అని చెప్పాలి. మొత్తంగా ఈ చిత్రం టైం పాస్ అయ్యేలా ఉంటుంది' అని చెప్పుకొచ్చారు.

సెకెండాఫ్ చాలా బాగుంది:
శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి నటించిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాను చూసిన ఇంకో నెటిజన్ ఇలా స్పందించారు. 'గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా సెకెండాఫ్ చాలా కామెడీగా ఉంది. సత్య, సునీల్ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ అదిరిపోయాయి. మెథడ్ యాక్టింగ్ సీన్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి' అంటూ వివరించారు.

సహనానికి పరీక్ష అంటూ:ఎంతో మంది కమెడియన్లు నటించిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీని వీక్షించిన మరో నెటిజన్ 'గీతాంజలి మళ్లీ వచ్చింది సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది. దీనికి నా రేటింగ్ 2/5. ఇందులో ఇంటర్వెల్ ట్విస్ట్, కొన్ని నవ్వించే సన్నివేశాలు బాగున్నాయి. కానీ, స్టోరీ బోరింగ్‌గా ఉండడం, సెకెండాఫ్, స్క్రీన్‌ప్లే, లీడ్ రోల్స్ ప్రభావం చూపకపోవడం మైనస్‌' అని తెలిపారు.

డీసెంట్ కామెడీ మూవీ:'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాను చూసిన మరొక నెటిజన్ ఇలా స్పందించారు. 'ఇది డీసెంట్‌గా సాగిపోయే హర్రర్ కామెడీ చిత్రం. ఫస్టాఫ్‌లో కొంత ల్యాగ్ ఉన్నా వినోదాత్మకంగానే సాగింది. కమెడియన్లను బాగా వాడుకున్నారు. సునీల్ కమెడియన్‌గా మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. మొత్తంగా హర్రర్‌ను టచ్ చేస్తూ సాగే ఈ చిత్రం మంచి ఎంటర్‌టైనర్ అనొచ్చు' అన్నారు.

Anjali Starrer Geethanjali Malli Vachindi Movie Twitter Review

ఓవరాల్‌గా అలాంటి టాక్:అంజలి 50వ సినిమాగా వచ్చిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది'కి సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్‌ను బట్టి దీనికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొంత మంది ఈ మూవీ బాగుందని అంటుంటే.. కొందరేమో ఏవరేజ్‌గా ఉందని చెప్తున్నారు. కానీ, కామెడీ మాత్రం వర్కౌట్ అయిందని అంటున్నారు. మరి థియేటర్లలో మౌత్ టాక్ ఎలా వస్తుందో కాసేపట్లోనే తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X