»   »  హీరోయిన్ అంజలికి కోర్టు సమన్లు

హీరోయిన్ అంజలికి కోర్టు సమన్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై: తమిళ దర్శకుడు కళంజియ్ వేసిన పరువు నష్టం దావా కేసులో చెన్పైలోని సైదాపేట కోర్టు హీరోయిన్ అంజలికి మంగళవారం సమన్లు జారీ చేసింది. ఈ రోజు ఆమె కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా డుమ్మా కొట్టింది. దీంతో ఆగ్రహించిన కోర్టు నవంబర్ 22లోగా తప్పకుండా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. గతంలో పలు పర్యాయాలు అంజలికి కోర్టు నోటీసులు అందజేసినా ఆమె హాజరు కాలేదు. దీంతో తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది కోర్టు.

తమిళ దర్శకుడు కళంజియం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఆమె ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఇప్పటికే పలుసార్లు కోర్టుకు గైర్హాజరు అయ్యింది. గతంలో కోర్టు పలు మార్లు హెచ్చరికలు చేసినా, అరెస్టు వారెంట్లు జారీ చేసినా ఆమె తన తీరు మార్చుకోలేదు.

పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, తన ఆస్తులు వాడుకుంటున్నారని, మానసికంగా హింసిస్తున్నారని మీడియాతో సంచలన వ్యాఖ్యాలు చేసిన అంజలి ఆ తర్వాత అజ్ఞాతంలో వెళ్లి అందరినీ హైరానా పెట్టిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత అజ్ఞాతం వీడిన ఆమె తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. కాగా....అంజలి తనపై ఆరోపణలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు కళంజియం ఆమెపై పరువునష్టం దావా వేసారు. అంజలి తన సినిమాకు డేట్స్ ఇచ్చి హాజరు కావడం లేదని, ఆమె మూలంగా తమకు లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆయన అంటున్నారు. అంజలి తెలుగులో వెంకటేష్-రామ్ మల్టీ స్టారర్ 'మసాలా' చిత్రంలో వెంకటేష్ సరసన నటిస్తోంది.

English summary
Actress Anjali on Tuesday was directed by a court in Chennai to present herself before it on November 22 in connection with the defamation case filed by Tamil director Kalanjiyam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu