'సీతమ్మ వాకిట్లో...' హీరోయిన్ ఐటం సాంగ్ హైలెట్
చెన్నై టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రాజెక్టు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రంలో లో వెంకటేష్ సరసన నటిస్తున్న హీరోయిన్ అంజలి. ఈ తెలుగమ్మాయి తమిళంలో ఎక్కువ చిత్రాలు చేస్తోంది. అవి అనువాదాలుగా తెలుగులోకి వస్తున్నాయి.ఇప్పుడు ఆమె 'సింగమ్ 2' చిత్రంలో ఓ ఐటం సాంగ్ చేసేందుకు అంగీకరించిందని చెన్నై సమాచారం. ఇందులో సూర్య హీరో. ఇది తెలుగులో వచ్చిన 'యముడు'కి సీక్వెల్. నయనతార,శ్రీయ డేట్స్ ని మొదట ఈ ఐటం సాంగ్ కి అడిగినా డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటంతో అంజలి సీన్ లోకి వచ్చిందని తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే ఈ ఐటం సాంగ్ కి అదిరిపోయే ట్యూన్ రెడీ చేసినట్లు చెప్తున్నారు.
అనుష్క, హన్సిక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి హరి దర్శకుడు. సూర్య, అనుష్క కాంబినేషన్ లో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రం 'సింగమ్'(తెలుగులో యముడు). ఇప్పుడీ చిత్రం సీక్వెల్ రెడీ అవుతోంది. ఇందులో హన్సిక హీరోయిన్ చేస్తోంది. ఈ చిత్రంలో హన్సిక స్కూల్ విద్యార్థినిగా కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది. ఇటీవలే వాటిని చిత్రించారు. ఈ ముద్దుగుమ్మ సూర్యతో కలిసి నటించటం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తోంది. అలాగే చిత్రం మెగా హిట్ అవుతోందని ఆమె చెప్తోంది. అయితే చిత్రంలో ఆమె పాత్ర కేవలం పదిహేను నిముషాలు మాత్రమే ఉంటోందని తెలుస్తోంది. అనుష్క మెయిన్ హీరోయిన్.ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఈ చిత్రంలో అనుష్క, వివేక్, సంతానం కీ రోల్స్ లో చేస్తున్నారు. ప్రియన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. సూర్య కూడా సెవెంత్ సెన్స్ చిత్రం ఊహించిన విధంగా వర్కవుట్ కాకపోవటంతో మరో కమర్షియల్ సక్సెస్ తో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నారు. దానికి సీక్వెల్ సరైన మార్గం అని ఫిక్సయ్యాడని తమిళ పత్రికలు అంటున్నాయి. అందులోనూ హన్సికకు అక్కడ మంచి మార్కెట్ ఉంది. ఆమెకు తెలుగులో ఆఫర్స్ లేవు. దాంతో ఆమె దృష్టి ఇప్పుడు తమిళంలో నెంబర్ వన్ స్టేజికి వెళ్లాలనే ఉంది. తాజాగా 'ఢిల్లీ బెల్లీ' ఆధారంగా యూటీవీ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో ఆర్యతో కలిసి అంజలి ముద్దు సన్నివేశంలో నటించింది.


Click it and Unblock the Notifications











