పవన్ కళ్యాణ్ కి నేనే ఫస్ట్-బిగ్గెస్ట్ అభిమానిని ఆ తర్వాతే అందరూ: అంజనాదేవి

By Sindhu

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ అన్న విషయం తెలిసిందే. ఒక్క ఫ్యాన్స్ కే ఇండస్ట్రీలోని యాక్టర్స్ కి, సెలబ్రిటీస్ కి,. డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి ఇలా అన్ని వర్గాల్లోనూ పవన్ ని అభిమానించే ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారు. ఇంత మంది ఫ్యాన్స్ మద్య నేనే పవన్ ఫస్ట్ అభిమాని అంటూ ఒక అన్నారు. ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే....?

అభిమానులంతా ఎంతో ఆశతో ఎదురుచూసిన 'పంజా" మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంజా చిత్రం ఆడియో వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ ఏ.వి. ఒకటి స్ర్కీనింగ్ చేసారు. అందులో పవన్ కళ్యాణ్ తల్లి అంజానాదేవి మాట్లాడుతూ 'కళ్యాణ్ బాబు సినిమాల్లో ఎంత నిజాయితీ పాత్రలు చేస్తాడో...నిజ జీవితంలో కూడా అలానే స్ట్రయిట్ ఫార్వార్డ్ గా ఉంటాడు అన్నారు. సినిమాలోనే హీరో కాదు..రియల్ లైఫ్ లో కూడా వాడు హీరోనే. నాకు వాడిలో నచ్చిన విషయం అదే. నేను కళ్యాణ్ బాబుకి ఫస్ట్ నుండి పెద్ద అభిమానిని నా తర్వాతే మిగతా వాళ్ళంతా అనేంతగా నేను కళ్యాణ్ బాబుని ఇష్టపడతాను" అని పవన్ కళ్యాణ్ మాతృమూర్తి అంజనాదేవి చెప్పారు . పవన్ పట్ల ఆమెకెంత ప్రేమాభిమానాలున్నాయో ఆడియోలో స్ర్కీనింగ్ చేసిన వీడియో అందరికీ స్పష్టం చేసింది.

సంఘమిత్ర ఆర్ట్స్‌, ఆర్కా మీడియా వర్క్‌ సంస్థలు సంయుక్తంగా పంజా చిత్రాన్ని నిర్మించాయి. యువన్‌ శంకర్‌ రాజా చక్కని సంగీతం అందించారు. నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ నిర్మాతలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X