'బెజవాడ రౌడీలు' లో ఆమె ఐటం సాంగ్
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం బెజవాడ రౌడీలు చిత్రం కోసం రీసెంట్ గా ఓ ఐటం సాంగ్ ని చిత్రీకరించారు. అల్యూమినయం ఫ్యాక్టరీ లో స్పెషల్ సెట్ వేసి షూటింగ్ జరుపుకున్న ఈ పాటలో డాన్ శీను హీరోయిన్ గా చేసిన అంజనా సుఖాని డాన్స్ చేసింది. రామ్ గోపాల్ వర్మ కుర్రాళ్లకు కిక్కిచ్చేలా ఈ పాటను రాయించి చిత్రీకరించారని తెలుస్తోంది. రమ్ము ..జిన్ను..వోడ్కా కన్నా కైపెక్కి ఉన్నాయి కళ్ళు అంటూ ఈ పాట సాగుతుంది. ఇక వివేక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య, జెనీలియా కలిసి నటిస్తున్నారు.
విజయవాడ నగరం రౌడీయిజం నేఫద్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్రం గురించి దర్సకుడు వివేక్ బెజవాడ రౌడీలు సినిమా ఒక లవ్ స్టోరీ అని..ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ అని చెప్పుతున్నారు. అలాగే సినిమాలో ఎలాంటి రౌడీయిజం కానీ..బెజవాడకు చెందిన బ్యాక్ డ్రాప్ ఎలాంటిది కూడా ఉండదని హామీ ఇస్తున్నారు. ఎలాంటి రౌడీల నేపథ్యం కానీ..ఎలాంటి హింసాత్మక ఘటనలు కానీ ఉండబోవని అంటున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా సినిమా పాట మాత్రం చాలా హాట్ గా ఉంటుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











