పూరీ మార్క్..రవితేజ టచ్!!
"ఆంజనేయుల మీద చెయ్యవేయడమంటే ఆల్ మోస్ట్ ప్రాణాలు వదిలేసినట్లే"...అంటూ రవితేజ తనదైన స్టైల్లో ఆంజనేయులు చిత్రంలో చెప్పే డైలాగులు ఇప్పుడు అన్ని చోట్లా చర్చగా మారాయి. సాధారణంగా ఇలాంటి డైలాగులు పూరీ జగన్నాధ్ చిత్రాల్లో చోటు చేసుకుంటాయి. అందులోనూ దర్శకుడు పరుశరామ్..పూరీ జగన్నాధ్ శిష్యుడు కావటంతో ఆ ప్రభావం బాగా ఎక్కువగా ఉందని రషెష్ అంటున్నారు. అసలు అతని మొదటి సినిమా యువత లోనే నికిల్ పాత్రను రవితేజను పూర్తి స్ధాయిలో ఆవహించినట్లు తయారుచేసారు. అలాంటిది రవితేజనే దొరికాడు కాబట్టి విజృంభించేసాడుని తెలుస్తోంది. అలాగే ఆంజనేయులు చిత్రంలోదే మరో డైలాగ్ "సాధారణంగా నాకు ఎవరిమీదా చెయ్యవేయాల్సిన అవసరం రాదు..ఒకవేళ వస్తే ఆ చెయ్య కూడా నా మాట వినదు.."అనేది కూడా మంచి పంచ్ అని విశ్లేషిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ ఓ జర్నలిస్టుగా కనిపిస్తాడని సమాచారం. అందుకోసం హెచ్.ఎం.టీవీ ఛానెల్ లో షూటింగ్ చేసారు. ఇక రవితేజ సరసన నయనతార నటిస్తోంది. ఇక వీళ్ళద్దరి కాంబినేషన్లో గతంలో దుబాయిశీను చిత్రం వచ్చింది. ఆగస్టు రెండవ వారంలో రిలీజయ్యే ఈ చిత్రాన్ని హాస్యనటుడు గణేష్ నిర్మిస్తున్నారు. కిక్ తర్వాత రిలీజుకు రెడీ అవుతున్న చిత్రం కావటంతో బయ్యర్లలో మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











