twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్‌ది హత్యే.. పెంపుడు కుక్క బెల్ట్‌ను మెడకు బిగించి.. సిబ్బంది సంచలన వ్యాఖ్యలు

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణించి రెండు నెలలు దాటుతున్నా ఆ మరణం వెనుక వాస్తవాలు బయటకు రాకపోగా.. అనేక అనుమానాలు సునామీలా లేస్తున్నాయి. తాజాగా ఆయన మాజీ సిబ్బంది అంకిత్ ఆచార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్య అంటూ తన సందేహాలను వ్యక్తం చేశారు. ఇటీవల రిపబ్లిక్ టీవీతో మాట్లాడుతూ.. సుశాంత్ మెడపై కమిలి ఉన్న మరకలపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. అంకిత్ ఆచార్య బయటపెట్టిన అనుమానాలు ఏమిటంటే..

    Recommended Video

    Sushant Singh Rajput Pet Dog Fudge Heart Breaking Moments
    సూసైడ్ చేసుకొనే వ్యక్తి కాదు

    సూసైడ్ చేసుకొనే వ్యక్తి కాదు


    సుశాంత్ సార్ ఆత్మహత్య చేసుకొనే మనిషి కాదు. అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే అడ్డుకొనే వ్యక్తి. సూసైడ్ ఆలోచనలు ఉంటే వారికి సానుకూలంగా మాటలు చెప్పి ధైర్యాన్ని కలిగిస్తారు. ఆత్మహత్య చేసుకొంటే తల్లిదండ్రులు పుట్టెడు దు:ఖంలో మునిగిపోతారని చెప్పేవాడు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకొంటారా? అని అంకిత్ ఆచార్య అభిప్రాయపడ్డారు.

    మెడపై ఉన్న మరకలు చూస్తే..

    మెడపై ఉన్న మరకలు చూస్తే..

    సుశాంత్ శరీరంపై ఉన్న గాయాలు, మరకలు చూస్తే ఆత్మహత్యగా అనిపించడం లేదు. ముమ్మాటికి అది హత్యే అనే ఫీలింగ్ కలుగుతున్నది. ఆయన మృతదేహానికి సంబంధించిన ఫొటోలను చూసిన తర్వాత నా పరిధిలో పరిశోధన చేశాను. ఎవరైనా ఉరి వేసుకొంటే మెడ చుట్టూ U ఆకారంలో మచ్చ పడుతుంది. ఎవరైనా మెడ చుట్టూ ఏదైనా బిగిస్తే O ఆకారంలో మరకలు పడుతాయి అని అంకిత్ చెప్పారు.

    పెంపుడు కుక్క బెల్ట్‌తో

    పెంపుడు కుక్క బెల్ట్‌తో

    సుశాంత్ మెడపై ఉన్న మరకలు, మచ్చలు, కమిలిన గాయాలను పరిశీలిస్తే.. ఆయన పెంపుడు కుక్క ఫడ్జ్ బెల్ట్‌తో బిగించి ఉంటారనే అనుమానం కలుగుతుంది. నేను ఆయన వద్ద పనిచేసినప్పుడు ఫడ్జ్‌ను బయటకు తీసుకెళ్లే వాడిని. ఆ పెంపుడు కుక్క బెల్ట్‌ను కూడా నేను కడిగే వాడిని. సుశాంత్ మెడపై ఆ బెల్ట్ బకెల్ మార్క్ ఉంది. ఒకవేళ సుశాంత్ ఉరివేసుకొంటే.. ఉపయోగించిన ఆకుపచ్చ గుడ్డ వల్ల ఆయన మెడపై అలాంటి గుర్తులు ఉండవు అని అంకిత్ ఆచార్య వెల్లడించారు.

    నమ్మకమైన ఉద్యోగుల తొలగింపు

    నమ్మకమైన ఉద్యోగుల తొలగింపు

    సుశాంత్‌కు నమ్మకంగా పనిచేసే వ్యక్తులను, సిబ్బందిని ఉద్యోగంలో నుంచి రియా చక్రవర్తి తీసేసింది. ఎలాంటి కారణం లేకుండా సిబ్బందిని తొలగించినప్పుడే అనేక అనుమానాలు కలిగాయి. ఎవరైనా అనుమానాస్పదంగా మరణిస్తే పోలీసులు వచ్చే వరకు మృతదేహాన్ని ఎవరూ ముట్టుకోవద్దు. ఇంట్లో పనిచేసే సిబ్బంది ఎలా ముట్టుకొంటారు అని అంకిత్ ఆచార్య ప్రశ్నించారు.

    ఆ రోజు సిబ్బంది ఎందుకు వెళ్లలేదు

    ఆ రోజు సిబ్బంది ఎందుకు వెళ్లలేదు

    సుశాంత్ ఇంటిలో పనిచేసేటప్పుడు ప్రతీ 15 నిమిషాలకోసారి ఆయనతో మాట్లాడేవాడిని. ఆయనకు ఏమైనా అవసరముందా అని అడిగి తెలుసుకొనే వాడిని. అయితే జూన్ 14వ తేదీ రోజు ఆయన వద్దకు 10 నుంచి 2 గంటల వరకు ఎందుకు వెళ్లలేదు. డోర్లు బద్దలు కొట్టడం, తాళాలు మరమత్తు చేసే వ్యక్తి రప్పించడం లాంటి విషయాల్లో అనేక అనుమానాలు ఉన్నాయి అని అంకిత్ ఆచార్య పేర్కొన్నారు.

    English summary
    Sushant Singh Rajput suicide become a mystery even after two months of mumbai police investigation. Ex assistant Ankit Acharya rises questions over Sushant Singh Rajput death. Ankinth Said that, Sushant Sir couldn’t commit suicide. The mark Sushant Singh neck resembles that of his dog Fudge’s belt.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X