అతడే నా బాయ్ ఫ్రెండ్... ఆ హీరోతో బ్రేకప్ తర్వాత ఇదీ సంగతి!
హిందీ టీవీ నటి అంకిత లోఖండే ఇటు పర్సనల్‌గా, అటు ప్రొఫెషనల్‌గా హ్యాపీ స్పేస్ ఎంజాయ్ చేస్తోంది. జనవరి 25న విడుదలయ్యే 'మణికర్ణిక' సినిమాతో అంకిత సినీ రంగంలోకి అడుగు పెడుతున్నారు. మరో వైపు ఆమె జీవితంలోకి కొత్త ప్రేమికుడు ప్రవేశించాడు. బాలీవుడ్ నటుడుతో లాంగ్ రిలేషన్ బ్రేకప్ తర్వాత... ఎట్టకేలకు తనకు తగిన జోడీని వెతుక్కుంది.
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం... బిలాస్‌పూర్‌కు చెందిన వ్యాపారి విక్కీ జైన్‌తో అంకిత ప్రేమలో పడిందని, త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ప్రేమ, పెళ్లి గురించి స్పందించారు.

అతడితో ప్రేమలో ఉన్నమాట నిజమే
తను ప్రేమలో పడ్డట్లు వస్తున్న వార్తలపై అంకిత స్పందించారు. నేను ప్రేమలో పడ్డమాట నిజమే. అతడు చాలా మంచి వ్యక్తి. బిలాస్‌పూర్‌కు బిజినెస్ మ్యాన్. సమయం వచ్చినపుడు అన్ని విషయాలు వెల్లడిస్తాను అని తెలిపారు.

పెళ్లి ఆలోచన లేదు..
ఏ మనిషికైనా ప్రేమ, రిలేషన్‌షిప్ అనేది ఎంతో ముఖ్యం. అదే మనల్ని ముందు నడిపిస్తుంని నమ్ముతాను. అయితే ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన అయితే లేదు అని అంకిత లోఖండే స్పష్టం చేశారు.

మణికర్ణికలో కీలకమైన పాత్రలో...
నిన్నటి వరకు టీవీ నటిగా ఉన్న అంకిత లోఖండే... ‘మణికర్ణిక'తో సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఇందులో ఆమె ఝాల్కరిబాయి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీలో హీరోయిన్ కంగనాకు సపోర్టుగా ఉండే పూర్తి నిడివిగల పాత్ర ఇది.

జనవరి 25న విడుదల
‘మణికర్ణిక' చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, కంగనా రనౌత్ దర్శకత్వం వహించారు. ఝాన్సీ లక్ష్మి భాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











